ఆర్టికల్ 20 వీసా ఉన్న వారికి బిగ్ షాక్...వారి వేటుకు రంగం సిద్దం...!!!

ఆర్టికల్ 20 వీసా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు తమ దేశంలో కాకుండా వారి స్వదేశంలో ఉన్నట్లయితే అలంటి వారు జూన్ లోగా తిరిగి రాకపోతే ఇక వారి వీసా శాశ్వతంగా రద్దు అవుతుందని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ నిభందన కేవలం ఆర్టికల్ 20 వీసా కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

 Big Shock For Those With Article 20 Visa Prepare The Field For Their Hunt Ar-TeluguStop.com

ఇంతకీ ఏమిటి ఈ ఆర్టికల్ 20 వీసా, ఎవరికీ ఈ వీసా ఇస్తారు.ఎందుకు ఈ వీసాను కువైట్ ప్రభుత్వం రద్దు చేయాలని భావిస్తోంది అనే వివరాలలోకి వెళ్తే.

కువైట్ లోని కువైటీల ఇళ్ళలో పనిచేసేందుకు ఇచ్చే వీసానే ఆర్టికల్ 20 వీసా.ఈ వీసాను అత్యధికంగా భారతీయ వలస కార్మికులు పొందుతున్నారు.కువైట్ నిభంధనల ప్రకారం ఎవరైనా ఎన్నారైలు కువైట్ ను వదిలి వారి ప్రాంతాలలో 6 నెలలకు మించి ఉండరాదు అలా ఉన్న పక్షంలో కువైట్ వీసాను కోల్పోవడమే కాకుండా వారికి మళ్ళీ వీసా పునరుద్ధరణ జరుగదు.కానీ కరోనా సమయంలో కువైట్ ఎంతో మంది వలస వాసులను తమ దేశం నుంచీ వెళ్ళగొట్టగా, మరి కొందరు స్వచ్చందంగా సొంత ప్రాంతాలకు వెళ్ళారు.

కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కొందరు కువైట్ వెళ్ళగా మరికొందరు మాత్రం వారి ప్రాంతాలలోనే ఉండిపోయారు.ఇప్పుడు

Telugu Article Visa, Visa, Corona, Indian, Indian Nris, Kuwait, Kuwait Visa-Telu

అలాంటి వారందరికీ అక్కడి కువైట్ హెచ్చరికలు జారీ చేస్తోంది.ఆంక్షలు సడలించిన నేపధ్యంలో జూన్ లోగా ఆర్టికల్ 20 వీసా ఉన్న ప్రతీ ఒక్కరూ కువైట్ రావాలని లేకపోతె వారి వీసా రద్దు చేయబడుతుందని హెచ్చరించింది.ఈ వీసాను కలిగిన వారు కువైట్ వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఉన్నారని, వారిలో 3.5 లక్షల మంది భారతీయులు కాగా వీరిలో అత్యధిక శాతం మంది ఏపీ వాసులు ఉండటం గమనార్హం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube