ప్రస్తుత తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి చేయాలనే డిమాండు … నిర్ణయం ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో ఈ వ్యవహారంపై టిఆర్ఎస్ లో చర్చ జరుగుతూనే వస్తోంది.
ఒక దశలో కేసీఆర్ సైతం కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు కసరత్తు మొత్తం పూర్తి చేశారు.ఇక సీఎంగా పట్టాభిషేకం చేస్తారు అనుకున్న సమయంలో కెసిఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
ఇప్పటికిప్పుడు కెసిఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అలజడి రేగుతుంది అని, అసంతృప్తి వాదులు బయటకు రావడంతో పాటు, ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు అనే ఆలోచనతో కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే ప్రతిపాదనను అప్పట్లో టిఆర్ఎస్ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆ తర్వాత ఆయన మంత్రి పదవి కోల్పోవడం టిఆర్ఎస్ కు దూరం కావడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.ఇక కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు నుంచి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో, కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల పైన ఫోకస్ పెట్టారు.ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలను పట్టించుకోవడం లేదు.దీంతో పాలన గాడి తప్పుతోంది అని, టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతోంది అనే నిఘా వర్గాల రిపోర్టులు అందుతుండటంతో కెసిఆర్ సైతం ఆలోచనలో పడ్డారట.

ప్రస్తుతం కేటీఆర్ కు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేవు సమర్ధుడైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.పార్టీని సైతం తన అధీనంలోకి తెచ్చుకోవడం లో కేటీఆర్ సక్సెస్ కావడంతో దసరా నాటికి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.దీనికి తగ్గట్లుగానే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆంధ్రకు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు.
కేటీఆర్ చేస్తున్న విధానాలు నచ్చి ఆయనను సీఎం చేయాలని కోరుతూ విజయవాడ, కరీంనగర్ మీద హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్నాడు.ఈ పాదయాత్ర వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారడం తో మరోసారి కేటీఆర్ సీఎం అనే డిమాండ్ ఊపందుకుంది.