కొత్త ఫీచర్ ని అప్ డేట్ చేస్తోన్న ఇన్‌స్టాగ్రామ్.. ఇకపై అడ్డమైనవాటిని షేర్ చేయడం కుదరదు!

ఇన్‌స్టాగ్రామ్.ప్రస్తుతం మనకున్న సోషల్ మీడియాలలో జనాలు అత్యంత ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా ఏదన్నా వుంది అంటే అది ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే.

 Instagram Updating New Feature No More Sharing Crosswords , Instagram, New Fea-TeluguStop.com

దీని తరువాతే ఇంకేదైనా.ఇకపోతే ఇన్స్టా తరచూ సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ యూజర్లను మరింత ఆకట్టుకొనే దిశగా అడుగులు వేస్తోంది.

అంతేకాకుండా ఇప్పటికే ఉన్న ఫీచర్లను మరింత మెరుగుపరుస్తోంది.ఇందులో భాగంగా స్టోరీస్ ఫీచర్‌లో ఒక కొత్త లేఅవుట్‌ ను తీసుకొచ్చే పనిలో పడింది.

ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు ఇన్‌స్టా స్టోరీస్‌లో తమ జీవితంలో జరిగే ప్రతిదీ షేర్ చేసుకోవడం కుదరదు.

ఎందుకంటే కొత్త లేఅవుట్‌ కేవలం 3 స్టోరీలు మాత్రమే ఫాలోవర్లకు అనుమతి ఉంటుంది.

ఈ చేంజ్ ప్రస్తుతం బ్రెజిల్‌లోని ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు రిలీజ్ అయింది.ప్రస్తుతం, స్టోరీస్‌ లిమిట్ మార్చాలని ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నట్లు ప్రముఖ టెక్ నిపుణులు చెబుతున్నారు.

వారి ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ బ్రెజిల్‌లో స్టోరీస్‌ కోసం కొత్త లేఅవుట్‌ను పరీక్షిస్తోంది.ఈ లేఅవుట్‌ ఒకేసారి 3 స్టోరీస్‌ మాత్రమే డిస్‌ప్లే చేస్తుంది.

మిగిలిన వాటిని దాచిపెడుతుంది.ఈ అప్‌కమింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్‌ను చూసిన టెక్ నిపుణులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

యాప్ ఒకేసారి మూడు స్టోరీలను మాత్రమే చూపుతుందని, మిగిలిన వాటిని “షో ఆల్ (Show All)” బటన్ వెనుక దాచిపెడుతుందని వివరించారు.

ఆసక్తి ఉన్న వారు షో ఆల్ బటన్‌పై నొక్కి తాము ఫాలో అయ్యే వారు షేర్ చేసిన అన్ని స్టోరీలను చూడవచ్చు.

ఈ చేంజ్ బ్రెజిల్‌లోనే కాకుండా, ఇతర ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వచ్చిందా అనేది ఇంకా తెలియరాలేదు.బ్రెజిల్ దేశంలో ఈ కొత్త ఫీచర్‌ను ఎంత మంది యూజర్లు పొందారనేది కూడా తెలియాల్సివుంది.

ఇన్‌స్టాగ్రామ్ ఈ లేఅవుట్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకువస్తే… క్రియేటర్లకు వారి స్టోరీస్ కోసం ఫాలోవర్లు చూడగలిగే ఉత్తమమైన మూడు పోస్టులు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.తద్వారా ఫాలోవర్లు అనవసరమైన స్టోరీస్ కాకుండా కేవలం బెస్ట్ స్టోరీస్ మాత్రమే చూడగలుగుతారు.

ఫలితంగా సమయంతో పాటు స్టోరీలు స్కిప్ చేయాల్సిన శ్రమ తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube