యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్నపేరు.ఇతని ఫ్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ సీనియర్ నటి కరాటే కళ్యాణి నడిరోడ్డుపై గుడ్డలూడదీసి మరీ పరుగులు పెట్టించి కొట్టిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో బాగా పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి, మరిన్ని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ మరింత పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు.అయితే కరాటే కళ్యాణి చెంప దెబ్బ కొడితే ఇతని మైండ్ సెట్ సరిగా పనిచేయడం లేదు అందుకే ఏకంగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అయితే కరాటే కళ్యాణి ఇష్యూతో మరింత పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి లైవ్ డెబిట్ కి పిలుస్తుండటం తో తనే అతడు హీరోగా ఊహించుకుంటూ లైవ్ డెబిట్ లో నోటికొచ్చిన విధంగా వాగడం మొదలుపెట్టాడు.అయితే అతని మాటలను బట్టి చూస్తే నిజంగానే మానసిక పరిస్థితి సరిగా ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే అతడు పిచ్చి పట్టిన వ్యక్తిలా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు.అయితే ఇది వరకు రాంగోపాల్ వర్మ ప్రేరణతో ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పిన శ్రీకాంత్ రెడ్డి.
తాజాగా ప్లేట్ పురమాయించి వర్మని బిచ్చగాడు అనేసాడు.

రాంగోపాల్ వర్మ నాకు ఇన్స్పిరేషన్ ఏంటి తొక్క.వాడు నా ముందు బచ్చా.నా కంటే గొప్పోడు కాదు.
దమ్ముంటే నాతో పాటు డెబిట్ లో కూర్చోమని చెప్పండి.నాతో మాట్లాడమని చెప్పండి ముసలోడు ఇప్పుడు అంత యంగ్ జనరేషన్ నేను వర్మని కించపరచడం లేదు కానీ జనరేషన్ మారింది కొత్తవాళ్ళు వస్తుంటారు అని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ రెడ్డి.
మొత్తానికి శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.మరి ఈ విషయం పై సంచలన దర్శకుడు అయిన రాంగోపాల్ వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.