ఇపుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో పజిల్స్. అవును.
ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫోటోలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.అందువలన ఇలాంటి ఫొటోస్ సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనబడుతున్నాయి.
ఇలాంటి కొన్ని ఫోటోలు మనకు పైకి నార్మల్గానే కనిపిస్తాయి.కానీ వాటిని నిశితంగా గమనిస్తే తప్ప.
అందులోని రహస్యం ఏమిటో గుర్తించలేం.అలాంటి వాటినే ఆప్టికల్ ఇల్యూషన్స్ అని అంటారు.
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు బాగా ఉపయోగపడతాయి కనుక సైకాలిజిస్టులు ఇలాంటివి ఉపయోగించుకుని పేషేంట్లను ట్రీట్ చేస్తున్నారు.
అయితే అవి మీ వ్యక్తిత్వాన్ని ఎలా డిసైడ్ చేస్తాయో తెలుసుకుందాం.
పైన పేర్కొన్న చిత్రంలో 4 ఆప్టికల్ ఇల్యూషన్స్ దాగున్నాయి.అవేంటో గుర్తుపట్టాలి, పైగా ముందుగా దేన్నీ గమనించారో ఇక్కడ చెప్పగలగాలి.
దాంతో మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పగలుగుతారు మానసిక నిపుణులు. మీరు మొదటిగా వృద్దుడి ముఖాన్ని చూసినట్లయితే, మీరు ఎంతో సుందరమైన అంతర్దృష్టి కలిగి ఉంటారని అర్ధం.
అలాగే మీరు ప్రతీ విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు అని అనుకోవచ్చు.ఇక మీరు మొదటిగా విరిగిన గొడుగుతో ఉన్న స్త్రీని చూసినట్లయితే, మీలో సెన్స్ ఆఫ్ హ్యుమర్ (హాస్యం) ఎక్కువగా ఉంటుందని అర్ధం.
అలాంటి లక్షణం మీలో ఉన్నట్లు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చెబుతోంది.

అలాగే మీరు ముందుగా గొడుగు ఎగిరిపోకుండా పట్టుకునేందుకు ప్రయత్నిస్తోన్న స్త్రీని చూసినట్లయితే మాత్రం మీరు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని అర్ధం.అలాగే మీరు సానుకూల దృక్పథం అనే అరుదైన లక్షణాన్ని కలిగి వుంటారు.నాయకత్వపు లక్షణాలు మీ సొంతం.
ప్రజలకు సరైన మార్గం చూపకుండా మీరు వెనకడుగు వెయ్యరు అని అర్ధం అన్నమాట.ఇతరులు మీ విషయంలో ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారనేది అక్షర సత్యం అని చెబుతున్నారు మన సైకాలజిస్టులు.