పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యి మంచి ఆదరణ దక్కించుకుంది.
కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు , మ్యూజిక్ సినిమాకి హైలైట్ అయ్యాయి.
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టించాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేశారు.
ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ సినిమా గురించి పలు ముచ్చట్లు చెబుతూ ఈ సినిమాలో తనకు ఇష్టమైన పాట ఏంటో తెలియచేశారు.ఈ సినిమాలో తనకు మ.
మ.మహేషా అనే పాట అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తనకు ఇష్టమైన పాట గురించి బయటపెట్టారు.సాధారణంగా కీర్తి సురేష్ తన సినిమాలలో ఎక్కువగా డాన్స్ చేయరు కానీ ఈ పాటలో మాత్రం తనలో దాగిఉన్న డాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం బయట పెట్టారు.

ఈ క్రమంలోనే ఈ పాట విడుదలైన అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్లో కూడా అద్భుతమైన రికార్డులను అందుకుంది.అలాగే ఈ పాటలో కీర్తి సురేష్ డాన్స్ పై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.మొత్తానికి కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా విడుదలయిన మూడు రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరినట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతమందించిన విషయం మనకు తెలిసిందే.