పాత సినిమాలను బాగా చూసే వారికి సీనియర్ నటి షావుకారు జానకి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దాదాపుగా 70 సంవత్సరాల క్రితం తెలుగు సినిమాలోకి అందరిలాగే ఎంట్రీ ఇచ్చింది.
ఈమె సినిమా ప్రవేశం చేసే సమయంలో వయసు చాలా తక్కువట.అప్పుడే తన మొదటి సినిమా షావుకారు లో నటించింది.
ఈ సినిమాలో తన నటనకు తెలుగు ప్రజలు నీరాజనాలు పట్టారు.అందుకే ఆ తర్వాత నుండి జానకి కాస్త షావుకారు జానకి గా మారిపోయింది.
ఈమె చేసిన ఈ సినిమా పెద్ద బ్యానర్ లో చేయడం వలన మంచి పేరును సంపాదించుకుంది.ఒక నటిగా తనకు అవకాశాలు కుపలు కుప్పలుగా వచ్చి పడ్డాయి.
వరుసగా సక్సెస్ లు అందుకుంటూ కెరీర్ లో మంచి స్థానంలో ఉంది.అయితే అతి తక్కువ సమయంలోనే ఒక హీరోయిన్ గా స్థిరపడడం అంటే అంత ఈజీ కాదు.
దీనికి జానకి అంకితభావం కారణం అని చెప్పాలి.
ఈమె ఏక కాలంలో అప్పట్లో స్టార్ హీరోయిన్ లు అయిన సావిత్రి, జమున, కృష్ణ కుమారి లాంటి టాప్ హీరోయిన్ ల నుండి నుండి ఎంతో గట్టి పోటీని ఎదుర్కొని హీరోయిన్ గా రాణించింది.
అలా ఆమె సంపాదించిన డబ్బుతో మద్రాసులో తాను నివసించడానికి ఒక బంగ్లాను కొనుగోలు చేసింది.అప్పట్లో ఇది చాలా ప్రాముఖ్యత చెందింది.జానకి బంగళా లోనే అప్పట్లో ఒక తెలుగు సినిమాలే కాదు.ఇతర భాషల సినిమా షూటింగ్ లు కూడా జరిగేవి.
సావిత్రి అప్పట్లో టాప్ హీరోయిన్.ఈమెకు ఆభరణాలు ఎక్కువగా ఉండేవి.
అయితే ఆమెతో సమానంగా నగలు ఉన్న ఏకైక హీరోయిన్ గా జానకి పేరు తెచ్చుకుంది.

ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యు లో మాట్లాడుతూ అప్పట్లో ఈమెకు మద్రాసు లో ఉన్న ఆస్తుల గురించి తెలిపింది.అయితే అప్పుడు ఈమెకు మద్రాసు లో ఉన్న ఆస్తి అలాగే ఉండి ఉంటే… ఇప్పుడు అది వేల కోట్లు విలువ చేసేది అని గుర్తు చేసుకుంది.అయితే ఆ ఆస్తిని ఏమి చేశారు అని అడిగితే… అక్కడి వాళ్ళు అమ్మేశారు అంటూ సమాధానం ఇచ్చింది.
నేను ఎప్పుడూ డబ్బు ఆస్తికి ప్రాముఖ్యత ఇవ్వలేదు.అందుకే నేను నా ఆస్తుల గురించి పట్టించుకోలేదు.
కొంత కాలం జానకి తన భర్తతో విడిపోయిందట.అయితే ఆయన కష్టపడడం భరించలేని ఒక భార్యగా ఆయనకు అవసరం అయినంత వరకు సాయం చేశాను.

అయితే అలా పొందిన ఆస్తి డబ్బును తన భర్త ఖర్చు చేశాడని తెలిపింది.అంతే కాకుండా తన భర్త తండ్రి సంపాదించిన ఆస్తులను సైతం వాటి అన్నతమ్ములు వాడేశారని బాధ పడింది.అలా తన భర్త అన్ని రకాల చెడు అలవాట్లకు బానిసగా అయ్యారని తెలిపింది.అంతే కాకుండా తన బిడ్డలను కూడా దూరం చేయడానికి ట్రై చేశారు అట… అయితే ఇన్ని చేసినా ఆయన చివరి రోజులలో మాత్రం తనతో ఉండి బాగోగులు చూసుకుందట.