సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వచ్చిన మూవీ సర్కారు వారి పాట.సినిమాకు మొదటిరోజు యావరేజ్ టాక్ వచ్చినా మహేష్ మేనియాతో సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది.
వరుసగా సూపర్ హిట్లతో తన సత్తా చాటుతున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ సెలబ్రేషన్స్ ముందు హైదరాబాద్ లో చేయాలని అనుకున్నా ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చేశారు కాబట్టి ఇప్పుడు సూపర్ హిట్ సెలబ్రేషన్స్ ఈవెంట్ మరోచోట చేయాలని ఫిక్స్ అయ్యారు.ఈ క్రమంలో సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని విజయవాడ లో చేయాలని చూస్తున్నారట.
ఆల్రెడీ వెన్యూని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.మే 16 లేదా 20న కానీ సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఉంటాయని తెలుస్తుంది.
సర్కారు వారి పాట వసూళ్ల హంగామా కూడా బాగానే ఉంది.పోటీగా మరే సినిమా లేకపోవడం వల్ల సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.