కాంగ్రేస్ పార్టీ ప్రజాప్రతినిధులు,ముఖ్యనేతల సమావేశం

యాదాద్రి జిల్లా:ఆలేరు నియోజకవర్గ స్థాయి 8 మండలాల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రేస్ ఎంపీపీలు,జడ్పీటీసీలు మరియు ముఖ్యనేతలతో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6న జరిగిన రైతు సంఘర్షణ సభలో భారత బావి ప్రధాని రాహుల్ గాంధీ తెలంగాణ రైతుల పట్ల చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

 Meeting Of Congress Party Representatives And Leaders-TeluguStop.com

కావున ఇంతటి గొప్ప నిర్ణయాన్ని ప్రతి రైతుకు,ప్రతి పల్లెకు చేరవేయాలని సూచించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ,పెట్టుబడి,పంటలకు మద్దతు ధర,ధరణి పోర్టల్ రద్దు తదితర అంశాలు ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి,ప్రతి రైతుకు చేరేవిధంగా కరపత్రాలను,బ్యానర్లను అన్ని మండలాల అధ్యక్షులకు,నాయకులు తీసుకెళ్లాలని సూచించారు.

ఫ్లెక్సీలు,కరప్రతాలు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు,ఎంపీపీలు,జడ్పీటీసీలు నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు,జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు మరియు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube