బుల్లితెర షోలలో ఒకటైన క్యాష్ షోకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.తాజాగా ఈ షోకు మిల్కీ బ్యూటీ తమన్నా హాజరయ్యారు.
క్యాష్ 200 ఎపిసోడ్ సందర్భంగా ఎఫ్3 టీమ్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు.ఊసరవెల్లి సినిమాలోని నిహారిక నిహారిక పాట ద్వారా తమన్నా ఎంట్రీ ఇచ్చారు.
తమన్నా సుమకు పెళ్లైందా అని అడగగా మొన్నే పెళ్లైందని ఆమె సమాధానమిచ్చారు.తమన్నా వెంటనే మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారని కామెంట్లు చేశారు.
సునీల్, సోనాల్ చౌహాన్, అనిల్ రావిపూడి కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు.ఎఫ్3 సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదని ఈ సినిమా కొత్త కథతో తెరకెక్కుతోందని ఆయన అన్నారు.200 డేస్ దోచుకునేలా ఎఫ్3 ఉంటుందని సునీల్ అన్నారు.మైండ్ బ్లాంక్ సాంగ్ లో తమన్నా ఇరగదీశారని సుమ చెప్పగా అది రష్మిక సాంగ్ అంటూ తమన్నా సుమ పరువు తీసేశారు.
తమన్నా చాక్ లేట్ కోసం ఏడుస్తున్నట్టు నటించి షోలో సందడి చేశారు.తమన్నా సుమ చెవిలో పువ్వు పెట్టి నవ్వించారు.ఆ తర్వాత తమన్నా కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రోమో ఎండ్ అయింది.అయితే తమన్నా ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.
ఈ ప్రోమోకు 33 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.సుమ తన హోస్టింగ్ తో ప్రోమోలో మెప్పించారు.
తమన్నా షోలో తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులను మెప్పించారు.పలు సినిమాలకు తమన్నా సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారనే సంగతి తెలిసిందే.ఎఫ్3 ఈ నెల 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
తమన్నా ప్రస్తుతం చేతినిండా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.