కరెంట్ కట్.. వరుడు ఏం చేసాడో తెలుసా?

సాధారణంగా పెళ్లంటే వధువు మెడలో వరుడు తాళి కడతాడు.కానీ, ఇక్కడ మాత్రం మొత్తం రివర్స్ లో జరిగింది.

 Current Cut Do You Know What The Groom Did , Current , No Power , Bride , Groom-TeluguStop.com

తాళి కడుతుండగా కరెంట్ పోవడంతో వధువు సోదరి మెడలో తాళి కట్టాడు వరుడు.అత్తారింటికి వెళ్లబోతుండగా అసలు విషయం తెలిసి నానా రచ్ఛ జరిగింది.

ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది.

కరెంటు వైఫల్యం.

ఓ పెద్ద గందరగోళానికి దారితీసింది.ఒకే ముహూర్తానికి రమేష్‌లాల్‌ ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన దంగ్వారా భోలా, గణేష్‌ అనే ఇద్దరు యువకులతో ఆదివారం రోజు వివాహం ఫిక్స్ చేశారు.

అయితే.వివాహం జరిగే సమయంలో మండపంలో కరెంట్ పోయింది.

చీకటిలో ఒకే డ్రెస్సులో ఉన్న వధువులను పోల్చుకోలేకపోయాడు వరుడు.దాంతో తప్పు వధువుకు తాళి కట్టడంతో వివాహ వేడుక పూర్తయిపోయింది.

అయితే.వధూవరులు ముసుగు ధరించి ఉండడం, ఇద్దరి దుస్తులు ఒకేలా ఉండడంతో పెళ్లి జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు.

దీంతో కొద్దిగా గందరగోళం నెలకొంది.

Telugu Brides, Groom, Karismala, Nikita, Ujjainmadhya, Latest-Latest News - Telu

పెళ్లి జరిపించడానికి వచ్చిన పంతులు కూడా ‘మారిన’ వధువులతో ప్రదక్షిణలు చేయించాడు.ఇక పెళ్లి తంతు మొత్తం ముగిశాక వధూవరులు అత్తారింటికి వెళ్లారు.అక్కడ తమ ముసుగులను తొలగించగా.

మారిన తమ వధువుల గురించి తెలుసుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు.ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా జరిగింది ఏంటో తెలియక ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ విషయంలో కొద్ది సేపు వాగ్వాదం జరగడంతో.జరిగింది తెలుసుకుని ఓ కొలిక్కి వచ్చింది.

మరుసటి రోజు మరోసారి వివాహ వేడుక జరిపించాలని నిర్ణయించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube