సినీ పరిశ్రమ మొదలైన నాటి నుండి ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.సినిమా ఇండస్ట్రీ అంటేనే వారసత్వం అన్నట్లుగా మారిపోయింది.
హీరో, హీరోయిన్ల వారసులే కాకుండా దర్శక , నిర్మాతల వారసులు కూడా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి హీరోల మనవళ్ళు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.
ప్రముఖ హీరోల కూతుర్లు కూడ హీరోయిన్లుగా కాకపోయినా ప్రొడ్యూసర్లు గా, డైరెక్టర్లుగా, డిజైనర్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో ఇంటి నుండి మరో ఇద్దరు వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు.
ఆ వారసులు మరెవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనవరాళ్లు, హీరో మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియానా.వీరిద్దరూ తన తండ్రి నటించబోయే సినిమాలో సింగర్స్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం మంచు విష్ణు ” గాలి నాగేశ్వరరావు” అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
అవ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు.
మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వత బిజీగా ఉన్న మంచు విష్ణు చాలా కాలం గ్యాప్ తర్వాత ” గాలి నాగేశ్వరరావు” అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా ద్వారా మంచు విష్ణు తన కూతుళ్లను సింగర్స్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు.ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నాడు.ఈ సినిమా కోసం భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఒక పాటని అరియానా, వివియానా ఆలపించారు.సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే ఈ పాట ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతోందని సమాచారం.
అంతేకాకుండా ఈ సినిమాలోని ఒక పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయటంతో ఆ పాట కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.