ప్రస్తుతం, వేసవి.మామిడి పండ్ల సీజన్.
అందువలన మన ఫ్రూట్ మార్కెట్లన్నీ మామిడి పండ్లతో నిండిపోయాయి.అయితే ప్రస్తుత కాలంలో మనకు మార్కెట్లో లభించే ఆహార పదార్ధాలన్నీ కలుషితమైనవి అనడంలో సందేహమే లేదు.
అందువలన మనం ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వుంది.లేదంటే 100 ఏళ్ల జీవితాన్ని, 60 ఏళ్లకే ముగించాల్సి వస్తుంది.
అయితే చాలావరకు మన లైఫ్ టైం పడిపోయింది.ఇక అసలు విషయానికొస్తే, ఇపుడు మామిడి పండ్లను ఎలా తింటే ఆరోగ్యమో తెలుసుకుందాం.
పూర్వం మన తాతముత్తాతలు మామిడి పండుని కడిగి నీళ్లలో కాసేపు నానబెట్టిన తరువాత తీసుకోవాలి అని చెప్పేవారు.
అయితే మామిడికాయలను నీళ్లలో నానబెట్టమని చెప్పడం గురించి సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం.
ముఖ్యంగా మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ అనే సహజ అణువు ఉంటుంది.ఫైటిక్ యాసిడ్ ఆరోగ్యానికి మంచి, చెడు పోషకాలలో ఒకటి.
అందుకే దీన్ని యాంటీ న్యూట్రీషియన్‌గా పరిగణిస్తారు.ఫైటిక్ యాసిడ్ ఇనుము, జింక్, కాల్షియం ,ఇతర ఖనిజాల వంటి కొన్ని ఖనిజాల శోషణను పరిమితం చేస్తుంది.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిపండ్లను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టినప్పుడు శరీరంలో వేడిని కలిగించే అదనపు ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.అలాగే వీటిని నీటిలో నానబెట్టడం వల్ల మొటిమల వంటి అనేక చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది అని అంటున్నారు.
అలాగే మలబద్ధకం, తలనొప్పి, ఇతర గేస్ సమస్యల వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇక ఆయుర్వేద నిపుణులు మాట్లాడుతూ, డయేరియా వంటి చర్మ సమస్యలు మొటిమల వంటి దుష్ప్రభావాల నివారణకు ఈ విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు.అలాగే నానబెట్టిన పండ్లను తినడం ద్వారా వాటిపైన వున్న రసాయనాలను వదిలించుకోవచ్చు.మామిడికాయలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.
ఫలితంగా థర్మోజెనిసిస్ ఏర్పడుతుంది.అందువల్ల, మామిడికాయలను కాసేపు నీటిలో నానబెట్టడం వల్ల వాటి థర్మోజెనిక్ లక్షణాలను తగ్గిస్తుంది.
అందుకే వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం మంచిది.మామిడి పండ్లు కూడా అతిగా తినకూడదు.