ప్రెసెంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.దీంతో బిజినెస్ పరంగా కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.భారీ మొత్తంలో బిజినెస్ జరిగినట్టు సమాచారం అందుతుంది.తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ ఆడియో రైట్స్ కి గాను సోనీ మ్యూజిక్ వారు 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు టాక్. నాన్ థియేట్రికల్ హక్కులకు గాను అన్ని భాషల్లో కలిపి 85 కోట్లకి ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేశారట.
దీనితో ఈ సినిమాకు డీల్ క్లోజ్ అయ్యింది.

ఈ సినిమాకు సంబధించిన థియేట్రికల్ హక్కులు బిజినెస్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదట.దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.స్టార్ హీరోలకు కోట్ చేసే రేట్స్ ను విజయ్ లైగర్ సినిమాకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఒక కానీ అలా కాకుండా ప్లాప్ అయితే మాత్రం విజయ్ మార్కెట్ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఈ సినిమా ఏ మాత్రం అటు ఇటు అయినా ఆ తర్వాత వీరి కాంబోలో వస్తున్న జనగణమన పైన కూడా పడుతుంది.
మరి ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదా అనేది చూడాలి.