ఆ పాట షూటింగ్ లో కళ్ళు తిరిగి పడిపోయిన శ్రీ దేవి...?

భారతీయ చలనచిత్ర రంగంలోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ గా అతి పిన్న వయసులోనే ఎదిగి….అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్ లలో నెంబర్ వన్ గ ఎదిగిన హీరోయిన్ శ్రీ దేవి.

 Unkown Facts About Sridevi Details, Heorine Sridevi, Mg Rama Chandran, Sridevi M-TeluguStop.com

అయితే శ్రీదేవి నటిగానే కాదు ఒక భార్యగా కూడా తన కుటుంబం… తన కూతుళ్ళ కోసం తన కెరీర్ ని పక్కనపెట్టిన త్యాగమూర్తి.మరి అంతగొప్ప నటి నేడు మన లేరు అన్న వార్త వింటుంటే…ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుననము అంటేనే అర్థం చేసుకోవాలి ఆమె గొప్పతనం అంతటిది అని.

శ్రీ దేవి ( శ్రీ అమ్మ అయంగర్) 1963, ఆగస్ట్ 13, మంగళవారం రోజు మద్రాసు శివకాశీలో పుట్టిన అమ్మాయి.తన నాలుగేళ్ల వయసులోనే చిన్నారి అయ్యప్పస్వామిగా “తునైవాన్” లో వెండితెరపై మెరిసింది శ్రీదేవి.

అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎమ్.జి.రామచంద్రన్ శ్రీదేవిని చూసి “నమ్ నాడు” అనే చిత్రంలో నటింపజేశారు.ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమె జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి.

కానీ నిజనికి పైకి చాలా గంభీరంగా కనిపించే శ్రీదేవి చాలా భయస్తురాలు.

తల్లి మాటనే వేదవాక్కులా భావించేది.రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన.

బాలచందర్, భారతీ రాజా వంటి స్టార్ డైరెక్టర్ల నేతృత్వంలో నటించారు శ్రీదేవి.శ్రీదేవితో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు.

ఆయన దర్శకత్వంలో శ్రీదేవి దాదాపు 24 సినిమాల్లో నటించింది.మొదటిసారి రాఘవేంద్రరావు ఆమెను హీరోయిన్ గా “పదహారేళ్ళ వయసు” సినిమాకి ఎంపిక చేసుకొన్నారు.

Telugu Bhakta Tukaram, Chaal Baaz, Heorine Sridevi, Raghavendra Rao, Sridevi, Sr

అలాగే మొదట సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి “బడిపంతులు” అనే చిత్రంలో అయన మానవరాలిగా నటించిన శ్రీదేవి.తదనంతరం “వేటగాడు” లో ఎన్టీఆర్ పక్కన కథానాయికగా నటించింది.ఆ తర్వాత ఎన్టీయార్ తో కలిసి 12 సినిమాల్లో నటించింది శ్రీదేవి.ఇక 1973లో వచ్చిన “భక్త తుకారాం” అనే చిత్రంలో శ్రీదేవి టైటిల్ పాత్రధారి ఏయన్నార్ కి కూతురిగా నటించింది.

ఆ తర్వాత 1981లో “ప్రేమాభిషేకం” చిత్రంలో కథానాయికగా నటించింది.ఏయన్నార్ కాంబినేషన్ లోనూ 10 సినిమాల్లో నటించింది శ్రీదేవి.

అలాగే తరువాతి తరం హీరోలు అయినా చిరంజీవి సరసన “రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోక సుందరి, “మోసగాడు”, “రనువ వీరన్” చిత్రాల్లోను, నాగార్జున సరసన “ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా” చిత్రాల్లో, వెంకటేష్ తో కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించింది.

Telugu Bhakta Tukaram, Chaal Baaz, Heorine Sridevi, Raghavendra Rao, Sridevi, Sr

అదే “క్షణ క్షణం” వంటి చాల చిత్రాలతోనే నటించారు.బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఫామ్ లో ఉన్న శ్రీ దేవిని హాలీవుడ్ లో పలు అవకాశాలు వరించాయి.ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తన జూరాసిక్ పార్క్ చిత్రం లో నటించాల్సిందింగా శ్రీ దేవిని కోరారు, కానీ బాలీవుడ్ కి దూరం కావటం ఇష్టం లేని శ్రీ దేవి ఈ అవకాశాన్ని కాదన్నారు.

ఇక “చాల్ బాజ్” చిత్రం లోని “నా జానే కహా సే ఆయా హై” పాట చిత్రి కరణ సమయం లో శ్రీ దేవి హై ఫీవర్ తో కళ్ళు తిరిగి పడిపోయారట.అయితే ఈ టాపిక్ అప్పట్లో బాగా హైలెట్ అయిందట.

ఏది ఏమైనా ఇప్పుడు శ్రీ దేవి గారు మన మధ్య లేకపోవటం మాత్రం చాలా బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube