దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా కోసం జక్కన్న కసరత్తులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది.
ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ను తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అనంతరం కియారా అద్వానీ పేరు కూడా వినిపించింది.
తాజాగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం రాజమౌళి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.ఈ విషయం పై క్లారిటీ రావాలంటే చిత్రబృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.
ఇక సారా టెండూల్కర్ విషయానికి వస్తే తన తల్లి మాదిరిగానే సారా మెడిసిన్ పూర్తి చేశారు.
మోడలింగ్ రంగంలో ఎంతో పట్టు ఉన్నటువంటి సారా ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈమె అందానికి ఫిదా అయినటువంటి బాలీవుడ్ దర్శక నిర్మాతలు తనకు సినిమా అవకాశాలు కల్పించడంతో ముందు తన చదువును పూర్తి చేయాలని ఈమె సినిమా అవకాశాలను పక్కన పెట్టారు.అయితే ప్రస్తుతం తన చదువు పూర్తి కావడంతో సారా టెండూల్కర్ వెండితెర ఎంట్రీకి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం సారా టెండూల్కర్ ను తీసుకోవాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు సమాచారం.ఇదే కనుక నిజమైతే ఇక అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు.
అయితే ఈ విషయంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.