కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలలో హీరోయిన్ గా నటించడం ద్వారా శ్రీనిధి శెట్టి ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.కేజీఎఫ్1 సక్సెస్ తర్వాత శ్రీనిధి శెట్టికి ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వచ్చినా విక్రమ్ కు జోడీగా తెరకెక్కుతున్న కోబ్రా మినహా మరో సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.కేజీఎఫ్2 సినిమాలో శ్రీనిధి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.రీనా రోల్ కు ఆమె పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

 Interesting Facts About Kgf Heroine Srinidhi Shetty Details Here Srinidhi Shetty-TeluguStop.com

కేజీఎఫ్2 సక్సెస్ తర్వాత శ్రీనిధి శెట్టికి సినిమా ఆఫర్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయని సమాచారం అందుతోంది.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ దక్కాలని శ్రీనిధి శెట్టి కోరుకుంటున్నారని సమాచారం అందుతోంది.శ్రీనిధి శెట్టి మిస్ దివా సూపర్‌నేషనల్ విజేత కూడా కావడం గమనార్హం.కేజీఎఫ్2 సినిమాలో అమ్మ గురించి శ్రీనిధి చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ కు ఎమోషనల్ గా ఎంతగానో కనెక్ట్ అయ్యాయి.

Telugu Kgf, Kobra, Kolllywood, Prashanth Neel, Srinidhi Shetty, Yash-Movie

2016 సంవత్సరంలో జరిగిన మిస్ దివా సూపర్‌నేషనల్ పోటీలలో రీనా విన్నర్ గా నిలవడంతో పాటు ఈ ఘనతను సొంతం చేసుకున్న రెండో భారతీయురాలిగా ఆమె రికార్డులకెక్కారు.కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాకు సైమా ఈవెంట్ లో శ్రీనిధి శెట్టికి ఉత్తమ నటి అవార్డు దక్కింది.కోబ్రా సినిమా కూడా సక్సెస్ సాధిస్తే శ్రీనిధి శెట్టికి సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.శ్రీనిధి శెట్టికి కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలకు భారీ మొత్తం రెమ్యునరేషన్ గా దక్కిందని తెలుస్తోంది.కేజీఎఫ్2 సినిమాకు శ్రీనిధి శెట్టికి 3 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కిందని బోగట్టా.శ్రీనిధి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.

కోబ్రా సినిమా వల్ల తమిళంలో కూడా శ్రీనిధి శెట్టికి ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube