చరణ్ కాళ్ళపై పడ్డ అభిమాని.. నిన్ను ఎవరు సెట్ చేశారు తమ్ముడు అంటూ గాలి తీసిన చెర్రీ!

ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో హీరోలు మాట్లాడుతుండగా సడన్ గా అభిమానుల నుంచి ఒకటి దూసుకొని వచ్చి హీరో ని పట్టుకోవడం, కాళ్ళ పై పడటం, సెల్ఫీల కోసం ఎగబడటం, ఇంతలో బౌన్సర్లు ఆర్గనైజర్లు వచ్చి అతన్ని వెనక్కి లాక్కొని వెళుతూ ఉండగా.అప్పుడు హీరో ఆగు ఆగు అంటూ సెల్ఫీలు ఇచ్చి పంపించడం లాంటివి కామన్ అయిపోయాయి.

 Ram Charan Faced Unexpected Funny Incident In Acharya Pre Release Event, Ram Cha-TeluguStop.com

ఇప్పటికే ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.మరీ ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లలో జరుగుతూ ఉంటాయి.

అయితే అలా హీరోలు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు నిజంగానే అక్కడికి వస్తారా లేకపోతే ఆర్గనైజర్ ల సెట్టింగ్ లో భాగంగా అన్న విషయం పక్కన పెడితే.తాజాగా జరిగిన ఆచార్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ సెట్టింగ్ బాగోతాన్ని బయటపెట్టాడు.ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో బ్లాక్ షర్ట్ వేసుకున్న ఒక యువకుడు సడన్ గా స్టేజి పైకి వచ్చి రామ్చరణ్ కాళ్ళపై పడిపోయాడు.

అప్పుడు రామ్ చరణ్ తమ్ముడు.ఆగు ఆగు.అంటు ఎవరు నిన్న డిజైన్ చేసింది?నేను మాట్లాడుతున్నపుడు రమ్మన్నారా? అని స్టేజిపై అతన్ని అడగగా.అప్పుడు సదరు అభిమాని అవును అని తల ఊపి.అదంత సెట్టింగ్ లో భాగమే అని చెప్పకనే చెప్పేశాడు.

Telugu Acharya, Chiranjeevi, Pre, Ram Charan, Shreyas-Movie

అనంతరం ఆర్గనైజర్లు బౌన్సర్లు అక్కడికి వచ్చి ఆ యువకుడిని పక్కకు లాగుతుండగా ఇంతలో రామ్ చరణ్ వారిని వారించి ఆ యువకుడు తో సెల్ఫీ దిగి పంపించేశాడు.జేబుకి ఆచార్య బ్యాడ్జ్ ధరించి ఉండడం చూస్తుంటే అతడు ఆచార్య ఆర్గనైజింగ్ టీం సభ్యులు మాదిరిగానే ఉన్నారు.ఇక ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసింది శ్రీయాస్ మీడియా వారు.

అయితే మరి ఈ జిమ్ముక్కులు వాళ్లవేనా? లేకపోతే అన్ఎక్స్‌పెక్టెడ్‌ గా జరిగిందా అన్నది తెలియాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube