తెల్ల జుట్టు. ఈ పేరు వింటేనే చాలా మంది వణికిపోతూ ఉంటారు.
ప్రస్తుత రోజుల్లో యంగ్ ఏజ్‌లోనే వైట్ హెయిర్ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను జుట్టుకు వాడటం, ఒత్తిడి, పోషకాల కొరత, కాలుష్యం వంటి వాటి వల్ల ప్రధానంగా వైట్ హెయిర్ సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ఏదేమైనా వైట్ హెయిర్ వచ్చాక బాధ పడటం కంటే.రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ స్ప్రే సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ హెయిర్ స్ప్రేను ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఏ విధంగా దానిని వాడాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందుగా ఐదు మందారం పువ్వులు, పది మందారం ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల నల్ల బియ్యం, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, కట్ చేసి పెట్టుకున్న మందారం ఆకులు, పువ్వులు వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్‌ను స్ట్రైనర్ సాయంతో సపరేట్ చేసకోవాలి.
సపరేట్ చేసుకున్న వాటర్ కూల్ అయిన వెంటనే అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని రెండు, మూడు నిమిషాల పాటు స్పూన్‌తో కలుపుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో నింపి.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకోవాలి.ఆపై గంట షవర్ క్యాప్ పెట్టేసుకుని.అప్పుడు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా వారంలో ఒక్కసారి చేశారంటే తెల్లు జుట్టు దరి చేరకుండా ఉంటుంది.మరియు హెయిర్ సమస్య కూడా దూరం అవుతుంది.