అమెరికా : ట్రూమన్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన నలుగురు భారత సంతతి విద్యార్ధులు..!!

అమెరికాలో భారతీయులు పలు రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.అనేక విభాగాల్లో మనవారు కీలక హోదాల్లో వున్నారు.

 Four Students With Indian-origin In America Selected For Truman Scholarship , Am-TeluguStop.com

విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు.తాజాగా అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘‘ట్రూమన్ స్కాలర్‌షిప్ 2022’’కు నలుగురు భారత సంతతి విద్యార్ధులు ఎంపికయ్యారు.

దేశంలోని 53 కళాశాలలు, యూనివర్సిటీల నుంచి 58 మంది పబ్లిక్ సర్వీస్ లీడర్లతో పోటీపడి అమీషా ఎ కంబాత్, ఎషికా కౌల్, అవి గుప్తా, భావ్ జైన్‌‌లు ఈ ఘనత అందుకున్నారు.

ట్రూమన్ స్కాలర్‌షిప్ అధికారిక ప్రకటన ప్రకారం.

ఈ స్కాలర్‌కు ఎంపికైన వారికి నాయకత్వ శిక్షణ, కెరీర్ కౌన్సెలింగ్, ఫెడరల్ ప్రభుత్వంలో ప్రత్యేక ఉపాధి అవకాశాలతో పాటు పోస్ట్ గ్రాడ్యూయేట్ స్టడీస్ కోసం 30 వేల అమెరికన్ డాలర్లను అందజేస్తారు.లీడర్ షిప్, ప్రభుత్వ సర్వీసులు, ఎన్జీవో, న్యాయం, విద్య వంటి కెరీర్ ఎంచుకునే వారికి ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు.

Telugu Amisha Kambat, Calinia, Eshika Kaul, Indianorigin, Gupta, Gupta Bhav Jain

ట్రూమన్ స్కాలర్‌షిప్ అందుకున్న వారి విషయానికి వస్తే.అమీషా కాలిఫోర్నియాకు చెందినవారు.హార్వర్డ్ యూనివర్సిటీలో సోషల్ స్టడీస్, ఎకనామిక్స్ చదువుతున్నారు.న్యూజెర్సీకి చెందిన ఎషికా.వెల్లెస్లీ కాలేజీలో ఎకనామిక్స్ అండ్ పీస్ అండ్ జస్టిస్ అభ్యసిస్తున్నారు.అవి గుప్తా ఒరెగాన్‌లో నివసిస్తూ.

అమెరికన్ పాలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో స్పెషలైజేషన్‌తో పాటు పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్‌ చదువుతున్నారు.పెన్సిల్వేనియాకు చెందిన భావ్… గ్లోబల్ హెల్త్ కేర్ డెలివరీపై ఆసక్తిగా వున్నారు.

ట్రూమన్ స్కాలర్‌షిప్‌కు భారతీయ విద్యార్ధులు ఎంపికవ్వడం పట్ల అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.విజేతలకు అభినందనలు తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube