వైరల్ వీడియో: ఎలాంటి భయం లేకుండా పాములకు ముద్దులు పెడుతున్న చిన్నారి..!

ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కోటంటే పిచ్చి.అవును.

 A Child Kissing Snakes Without Any Fear , Sanake , Kissing , Social Media ,-TeluguStop.com

సాధారణంగా ఎవరన్నా తమ ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకోవడం మనం చూస్తుంటాం.దాని తరువాత కొంతమంది పిల్లుల్ని పెంచుకుంటారు.

అలాగే పక్షులు అయినటువంటి చిలుకల్ని, పావురాల్ని చాలామంది తమ ఇళ్లల్లో విరివిగా పెంచుకుంటూ వుంటారు.విశ్వాసంతో పడుంటాయని కుక్కల్ని, ఎలుకల్ని వేటాడుతాయని పిల్లల్ని, ఆహ్లాదం కోసం పక్షుల్ని పెంచుకుంటూవుంటారు.

అయితే కొంతమంది మాత్రం దీనికి విరుద్ధంగా విచిత్రమైన జీవుల్ని పెంచుకుంటూ వుంటారు.

అవును.

పిచ్చి పలు రకాలు.ఎవరి పిచ్చి వారిది.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఓ ఫారిన్ కంట్రీలో ఓ ఫామిలీ పాముల్ని ప్రేమగా పెంచుకుంటున్నారు.ఈ క్రమంలో వారికి పుట్టిన బిడ్డ కూడా పాములపై మనసు పారేసుకుంది.

బేసిగ్గా పామంటే చిన్నపిల్లలకు భయమేస్తుంది.కానీ, ఆ చిన్నారి మాత్రం వాటితో ఆడుకుంటోంది.

అలాగే ప్రేమగా ముద్దులు కూడా పెడుతోంది.ప్రస్తుతం ఆ చిన్నారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ వీడియో చూసినవారు “వామ్మో.ఆ చిన్నారికి భయంలేదుగా.

ఆ చిన్నారి ధైర్యానికి మొక్కాలి!” అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇకపోతే మనకి ఇక్కడ తక్కువగానీ, ఫారిన్ కంట్రీస్ లో అది చాలా సర్వ సాధారణం.అక్కడి ప్రజలు చాలా క్రేజీ.వారికి తోచింది చేస్తుంటారు.

మీకు తెలుసో లేదో గాని, అక్కడ వానపాముల్ని పెంచుకొనే వారు కూడా వున్నారు.అయితే ఇది ఏదో పిచ్చే అని తేలిగ్గా కొట్టి పారేయకండి.

వానపాములు వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అవి భూమిలోపల ఉండటం వలన భూమి సారవంతంగా ఉంటుంది.

అందుకే అక్కడి రైతులు కొందరు వాటిని వెతికి మరీ పట్టుకొని తమ ఇండ్లలో పెంచుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube