పంజాబీ ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్ .. దోహా - అమృత్‌సర్‌ డైరెక్ట్ ఫ్లైట్ పున: ప్రారంభం..!!

కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఎప్పటికప్పుడు ఈ బ్యాన్ ఎత్తివేయాలని భారత ప్రభుత్వం భావించినా.

 Flyers Happy As Doha-amritsar Direct Flight Resumes, Jyotiraditya Scindia, Union-TeluguStop.com

మధ్యలో కొత్త వేరియంట్ల కారణంగా ఈ నిర్ణయం వాయిదాపడుతూ వచ్చింది.ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కరోనా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.అంతేకాదు విమానాల్లో ఎయిర్‌ బబుల్‌ పద్ధతి కూడా 27 నుంచి రద్దు అవుతుందని ఆయన వెల్లడించారు.

కేంద్రం నిర్ణయంతో దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్ సంస్థలు భారత్ నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభించాయి.

ఈ క్రమంలో ఖతార్ ఎయిర్‌వేస్ ఏప్రిల్ 1 నుంచి దోహా- అమృతసర్ మధ్య డైరెక్ట్ విమానాన్ని పున: ప్రారంభించడంతో నగరంలోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఊపందుకుంది.ఈ సందర్భంగా ‘‘ఫ్లైఅమృత్‌సర్ ఇనిషియేటివ్’’ రోజువారీ డైరెక్ట్ విమాన సర్వీసులను పున: ప్రారంభించడాన్ని స్వాగతించింది.

ఫ్లై అమృత్‌సర్ ఇనిషియేటివ్ కన్వీనర్ సమీప్ సింగ్ గుమ్టాలా మాట్లాడుతూ.

యూరప్, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివసిస్తున్న పంజాబీ ప్రవాసులు నగరానికి రావడానికి కేంద్రం నిర్ణయం వీలు కల్పిస్తుందన్నారు.ప్రయాణీకులు అమృత్‌సర్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్, లగేజీ డ్రాప్ ఆఫ్, పికప్, కస్టమ్స్, ఇతర సౌకర్యాలను పొందవచ్చని చెప్పారు.

అమృత్‌సర్ నుంచి దోహా మీదుగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా ప్రయాణీంచడానికి సౌలభ్యంగా వుంటుందని సమీప్ సింగ్ వ్యాఖ్యానించారు.అంతర్జాతీయ సర్వీసులు తిరిగి ప్రారంభించడం వల్ల అమృత్‌సర్ ఆర్ధిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి ప్రోత్సాహకరంగా వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube