సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.
సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం ఒక కారణం అయితే.పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేయడం మరొక కారణం.
ఈమె విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ విడాకుల తర్వాత మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.
టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.ఇలా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఈమె ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
ఈమె ఇప్పుడు స్పీడ్ గా సినిమాలు ఒప్పుకుంటూ అంతే స్పీడ్ గా చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.ఈమె తెలివిగా వేస్తూ తన కెరీర్ ను మళ్ళీ పూల బాట చేసుకుంటుంది.
ఈమె తనకు కథలు చెప్పే డైరెక్టర్ లకు కథ నచ్చితే సిగ్నల్ ఇస్తుంది.కొత్త ప్రాజెక్టులు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా సమంత మరో బాలీవుడ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన సామ్ అవకాశం అందుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఈమెకు ఈ అవకాశం వచ్చిన మాట నిజమే అయితే సామ్ కు జాక్ పాట్ తగిలినట్టే.కుమార్ మంగత్ డైరెక్ట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కు సమంత సంతకం చేసినట్టు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇక సమంత ప్రెసెంట్ తెలుగులో శాకుంతలం సినిమా పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచింది.దీంతో పాటు యశోద సినిమా షూటింగ్ ఫాస్ట్ గా ఫినిష్ చేసే పనిలో ఉంది.అటు తమిళ్ లో కూడా ఈమె నటిస్తున్న కాతు వాకుల్ రెండు కాదల్ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యింది.ఇలా ఈమె అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఏలేందుకు ప్లాన్ వేసుకుంటుంది.