ఉగాది సందర్భంగా 'ది వారియర్'లో రామ్ పోతినేని స్టైలిష్ పోలీస్ లుక్ విడుదల

ఉగాదికి ఉస్తాద్ రామ్ పోతినేని స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.రాపో (#RAPO) అభిమానులకు పండగ తీసుకొచ్చారు.

 New Racy Poster From Lingusamy-rapo's The Warriorr Released Ram Pothieni, N Lin-TeluguStop.com

ఆయన స్టైలిష్ పోలీస్ లుక్ అదుర్స్ అని అంతా అంటున్నారు.రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘ది వారియర్’.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

‘ది వారియర్’లో రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు.ఖాకీ యూనిఫామ్ వేయడం ఆయన కెరీర్‌లో ఇదే తొలిసారి.సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు రామ్ పోలీస్ అనే సంగతి వెల్లడించారు.ఆ లుక్‌లో షార్ట్ హెయిర్ కట్, మీసాలు, కళ్ళలో ఇంటెన్స్‌తో రామ్ కొత్తగా కనిపించారు.రిలీజ్ డేట్ వెల్లడించిన సందర్భంగా విడుదల చేసిన లుక్‌లో గన్ పట్టుకుని సీరియ‌స్‌గా కనిపించారు.

ఉగాదికి మాత్రం స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.పోలీస్ యూనిఫామ్ వేసుకుని మ్యాచో బైక్ మీద రామ్ వస్తుంటే… ఆయన యాటిట్యూడ్, స్వాగ్ అభిమానులు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటి వరకూ విడుదలైన ప్రతి లుక్ సినిమాపై అంచనాలు పెంచింది.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “ప్రేక్షకులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

ఈ రోజు ‘ది వారియర్’లో స్టైలిష్ రామ్ లుక్ విడుదల చేశాం.టెర్రిఫిక్ రెస్పాన్స్ లభించింది.

ప్రస్తతం హైదరాబాద్‌లో రామ్, కృతి శెట్టిపై పాట చిత్రీకరిస్తున్నాం.త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు.

ఉన్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ది వారియర్’లో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు.

అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై.సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌.లింగుస్వామి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube