ప్రపంచంలో పెరుగుతున్న మానవ జనాభా.అడవి జాతులకు ముప్పుగా పరిణమించింది.
అయితే ప్రపంచంలో జంతువులు పాలించే ఒక ద్వీపం కూడా ఉంది.అవును మీరు విన్నది నిజమే, అదే జపాన్‌లోని ఓషిమా ద్వీపం.
ఈ ద్వీపంలో పిల్లుల సంఖ్య మానవుల సంఖ్య కంటే 6 రెట్లు అధికం.ఒషిమా ద్వీపాన్ని “క్యాట్ ఐలాండ్” అని కూడా అంటారు.
ఒషిమా జపాన్‌లోని ఇషినోమాకి నగరంలో ఒక చిన్న ద్వీపం.ఇది అజిషిమాకు పశ్చిమాన పసిఫిక్ మహా సముద్రంలోని ఓషికా ద్వీప కల్పంలో ఉంది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ద్వీపంలోని చాలా మంది ప్రజలు వేరే చోట ఆశ్రయం పొందారు.1950లలో సుమారు 1,000 మంది ప్రజలు ఒషిమా ద్వీపంలో నివసించారు.
కానీ క్రమంగా ఇక్కడ నివసించే వారి సంఖ్య తగ్గింది.ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది వృద్ధులు ఉండేవారు.అప్పట్లో ఒక వృద్ధ మత్స్యకారుడు ఎలుకల సమస్యతో ఇబ్బంది పడి కొన్ని పిల్లులను ఈ ద్వీపానికి తీసుకు వచ్చాడని చెబుతారు.క్రమంగా వాటి జనాభా పెరిగింది.
ఇప్పుడు వాటి సంఖ్య అక్కడున్న మనుషుల సంఖ్య కంటే 6 రెట్లు ఎక్కువ అయ్యింది.ఈ ద్వీపంలో వృద్ధులు, పెన్షనర్లు మాత్రమే నివసిస్తున్నారు.
పిల్లుల దీవిగా ప్రసిద్ధి చెందిన ఒషిమా ద్వీపంలో ఒక్క కారు కానీ, రెస్టారెంట్ కానీ లేదు.ఎక్కడ చూసినా పిల్లులు మాత్రమే కనిపిస్తాయి.
ఇక్కడ నివసించే వారు చేపల పెంపకం చేపట్టారు.