'రాజమౌళి నీకు డేంజరస్ మెన్ ఉంటే.. నాకు ఉమెన్ ఉన్నారు'.. ఆర్జీవీ మరో పోస్ట్.. వైరల్..

టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఏ సినిమా చేసిన అది ట్రెండ్ సెట్ చేసే విధంగానే ఉంటుంది.ఆయన ప్రతి సినిమా ఒక ప్రయోగమే.

 Rgv Tweet On Rrr Heroes Details, Apsara Rani,dangerious,maa Ishtam,naina Ganguly-TeluguStop.com

ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు సినిమా చేసిన అందులో పర్ఫెక్షన్ ఉంటుంది.తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.దీంతో టీమ్ అంతా ఇన్ని రోజుల టెన్షన్ మరిచి హాయిగా రిలాక్స్ అయ్యారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించాడు.అందరు ఊహించిన విధంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది.

ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను జక్కన్న కలిపి ఒకేతాటి మీదకు తీసుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.ఇక ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖులతో పాటు మిగతా ఇండస్ట్రీ వారు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు.

రామ్ గోపాల్ వర్మ కూడా ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించారు.అయితే తాజాగా వర్మ వదలకుండా మరొక ట్వీట్ చేసారు.

ఈసారి మాత్రం ఆయన మార్క్ వర్డ్స్ వదిలాడు.ఈయన ఇద్దరు హీరోయిన్ లతో ”మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమాతో రావడానికి సిద్ధం అయ్యాడు.ఈ క్రమంలోనే ఆయన ఒక ట్వీట్ చేసాడు.”వెల్ సార్.మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే.నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అని ట్వీట్ చేస్తూ ఫోటో కూడా షేర్ చేసాడు.

ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతుంది.అన్ని భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను కొత్తగా ప్రొమోషన్స్ చేస్తూ వర్మ బిజీగా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube