సాధారణంగా గంజాయి తాగిన వ్యక్తులు చాలా హ్యాపీగా చిందులు వేస్తుంటారు.కొందరు బాగా నవ్వుతూ పిచ్చిగా ప్రవర్తిస్తారు.
అయితే అత్యంత అడిక్టివ్ డ్రగ్ అయిన గంజాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.అలాంటిది తాజాగా ఒక వ్యక్తి మాత్రం ఏకంగా వెడ్డింగ్ కేక్ లోనే గంజాయి కలిపాడు.
చిలీలోని ఒక వ్యక్తి తన చెల్లి వెడ్డింగ్ కేకులో గంజాయి కలపగా.దాన్ని తిన్న అతిథులందరూ గోల గోల చేశారు.
దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మరికొందరు దీనిపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.ఇదెక్కడి చిలిపితనం అంటూ ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే శాంటియాగోకు చెందిన అల్వారో రోడ్రిగ్జ్ (29) తన సోదరి వెడ్డింగ్ కోసం ఏడు పొరలు ఉన్న ఒక పెద్ద కేక్‌ను తయారు చేశాడు.వీటిలోని ఒక పొరలో గంజాయిని ఉంచాడు.
అయితే ఇది కూడా కేక్ లాగానే కనిపించేలా 20 గంటలపాటు కష్టపడ్డాడు.అలా అది నిజంగా కేక్ లా ఉండటంతో దాన్ని చాలామంది తినేసారు.
ఆ తర్వాత పెద్దవారంతా చిన్న పిల్లల్లాగా గంతులేస్తూ వెడ్డింగ్ వెన్యూలో ఉత్సాహాన్ని నింపారు.దీనికి సంబంధించిన వీడియోకి టిక్ టాక్ లో కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.
పెళ్లికూతురు అన్నయ్య అల్వారో జామ్ ప్రెస్‌తో మాట్లాడుతూ తన చెల్లెలిని అడిగిన తర్వాతనే ఇలా గంజాయిని కేక్ లో ఉంచామని చెప్పాడు.పెళ్లి కూతురు ఆంటీ గంజాయి తాగిన తర్వాత చిన్న పిల్లలాగా డ్యాన్స్ చేసిందట.తమ అత్తలు లోకాన్ని మరచి ఫన్నీగా డ్యాన్స్ చేశారని అతను చెప్పాడు.ఆమెకు వెన్నునొప్పి ఉందని కానీ కేక్ తిన్న రెండు గంటల తర్వాత, ఆమె నొప్పి మాయమైందని.
తర్వాత ఆమె యంగ్ లేడీలా డ్యాన్స్ చేసిందని అల్వారో చెప్పుకొచ్చాడు.