త్రిబుల్ ఆర్ సినిమాలో ముందుగా అనుకున్నది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కాదట.. ఎవరంటే?

సాధారణంగా సినిమాల్లో ఒక హీరో కోసం కథ రాసుకోవడం ఇక ఆ తర్వాత ఆ సినిమాను వేరే హీరోతో తెరకెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.అయితే ఏ దర్శకుడైనా అలా చేస్తారేమో కానీ దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా చేయాలనుకుంటే ఆ హీరోతోనే సినిమా చేస్తూ ఉంటాడు.

 First Choice Of Hero Roles In Rrr Movie Details, Junior Ntr, Ram Charan, Rrr, Rr-TeluguStop.com

ఆ హీరోతో సినిమా చేసే ఛాన్స్ దక్కక పోతే ఆ కథని పక్కకు పెట్టేస్తూ ఉంటారు.ఇది ఎవరో చెప్పింది కాదు ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలలో దర్శక ధీరుడు రాజమౌళి చెప్పేసారు.

తను అనుకున్న హీరో సినిమా చేయలేకపోతే కథను పక్కన పెట్టేస్త అని తెలిపాడు.

అయితే ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా లో మాత్రం రాజమౌళి ఇలా చేయలేదట.

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా మల్టీస్టార్ సినిమా త్రిబుల్ ఆర్ రిలీజయింది.మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.ఇక ఆయా పాత్రల్లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు సెట్ కారేమో అన్నంతగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

Telugu Rajamouli, Arjun, Surya, Jr Ntr, Ntr, Karthi, Rajnikanth, Ram Charan, Rrr

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్త మాత్రం అభిమానులను షాక్కు గురి చేసింది.ముందుగా త్రిబుల్ ఆర్ సినిమా కథ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ కాదట.

ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ఏకంగా స్టోరీ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పడం గమనార్హం.

ముందుగా హీరోని ఊహించుకో కుండా కథ రాయాలని అనుకున్నారట.

Telugu Rajamouli, Arjun, Surya, Jr Ntr, Ntr, Karthi, Rajnikanth, Ram Charan, Rrr

తర్వాత రజనీకాంత్- అర్జున్ తర్వాత సూర్య -కార్తీ ఇలా రెండు జంటలతో సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నారట విజయేంద్రప్రసాద్.కానీ చివరికి ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో తమ ఆలోచన ఆగిపోయిందన్న విషయం చెప్పారు ఆయన.ఇక ఈ సినిమాకు ఇద్దరిని ఎంచుకోవడానికి కారణం నిజజీవితంలో కూడా ఇద్దరు మంచి స్నేహితులు కావడమే అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube