కీళ్ల నొప్పులు.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య ఇది.
వయసు పెరిగే కొద్ది కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టడం సర్వ సాధారణం.కానీ, ప్రస్తుత రోజుల్లో ముప్పై, నలబై ఏళ్ల వారు సైతం ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
దాంతో కీళ్ల నొప్పులను నివారించుకోవడం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే కీళ్ల నొప్పులను మాయం చేయడంలో ధనియాలు అద్భుతంగా సహాయపడతాయి.
వంటల్లో విరివిరిగా వినియోగించే మసాలా దినుసుల్లో ధనియాలు ఒకటి.
ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండే ధనియాలు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.అలాగే కీళ్ల నొప్పులను మాయం చేయడంలోనూ ఇవి సహాయపడతాయి.
మరి ధనియాలను ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ వాటర్‌లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్‌పై పది నిమిషాల పాటు మరిగించుకుని.ఫిల్టర్ చేయాలి.ఇప్పుడు ఈ ధనియాల వాటర్‌ను గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక.ధనియాల్లో ఉండే ప్రత్యేకమైన పోషకాలు ఎముకలను దృఢపరిచి.
కీళ్ల నొప్పులను నివారిస్తాయి.
అలాగే మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.కప్పు నువ్వుల నూనెను పోయాలి.
నూనె కాస్త హీట్ అవ్వగానే అందులో ధనియాల పొడి వేసి స్లో ఫ్లేమ్‌పై పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత నూనెను మాత్రం ఫిల్టర్ చేసి.
ఒక బాటిల్‌లో నింపుకోవాలి.ఈ నూనెను కీళ్లకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేయడం ద్వారా కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.