పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్.. ఆ బాధ్యత వదిలేశానంటూ?

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని సినిమాలలో నటించడం ద్వారా హెబ్బా పటేల్ పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.కుమారి 21ఎఫ్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు హెబ్బా పటేల్ కు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

 Actress Hebah Patel Interesting Comments About Her Age In Instagram Chat Details-TeluguStop.com

మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో హెబ్బా పటేల్ జన్మించారు.తిరుమనం ఎనుం నిఖా అనే తమిళ సినిమాతో నటిగా హెబ్బా పటేల్ కెరీర్ మొదలైంది.

అలా ఎలా హెబ్బా పటెల్ కు తెలుగులో తొలి సినిమా కాగా కుమారి 21ఎఫ్ సినిమాతో హెబ్బా పటేల్ కు తొలి సక్సెస్ దక్కింది.2014 సంవత్సరం నుంచి గతేడాది వరకు హెబ్బా పటేల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ప్రస్తుతం తెలుగులో హెబ్బా పటేల్ కు అడపాదడపా ఆఫర్లు వస్తున్నాయి.తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన హెబ్బా పటేల్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Telugu Chit Chat, Fans, Hebah Patel, Kumari, Maharastra, Marrege, Tollywood-Movi

ఒక ఫ్యాన్ హెబ్బా పటేల్ ను ఏజ్ ఎంత అని అడగగా నాలోని జ్ఞానానికి సరిపడా వయస్సుకు చేరుకున్నానని హెబ్బా పటేల్ చెప్పుకొచ్చారు.తన అసలు వయస్సును మాత్రం వెల్లడించకుండా హెబ్బా పటేల్ జాగ్రత్త పడ్డారు.మరో నెటిజన్ మీ గ్లామర్ సీక్రెట్ ఏమిటని హెబ్బా పటేల్ ను అడగగా అది పెద్ద సీక్రెట్ అని ఆ విషయాన్ని బయటపెట్టకూడదని తాను అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Chit Chat, Fans, Hebah Patel, Kumari, Maharastra, Marrege, Tollywood-Movi

తన గ్లామర్ లో దేవుడు ఇచ్చింది కొంత అయితే డాక్టర్ల కృషి కొంత ఉందని ఆమె వెల్లడించారు.తన గ్లామర్ విషయంలో డాక్టర్ల కృషి ఉందని హెబ్బా పటేల్ చెప్పడంతో ఆమె ఏదైనా సర్జరీ చేయించుకుందా? అని కొంతమంది నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.మరో నెటిజన్ హెబ్బా పటేల్ ను పెళ్లి గురించి అడగగా పెళ్లి విషయం తన చేతిలో లేదని ఆ బాధ్యతను విధికే వదిలేస్తున్నానంటూ హెబ్బా పటేల్ షాకింగ్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube