ముంబై స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన రోహిత్ శెట్టి గురించి మనకు తెలిసిందే.ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలను, ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొని నేడు స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు.
రోహిత్ శెట్టి మొదటి పారితోషికం 35 రూపాయలు.అంతేకాకుండా రోహిత్ శెట్టి మొదట్లో హీరోయిన్ టబు చీరలు ఐరన్ చేసేవాడు అంటే చాలామంది నమ్మకపోవచ్చు.
అంతేకాకుండా ఆయన అలాంటి పని కూడా చేశారా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.రోహిత్ శెట్టి కి సినిమాల పై మక్కువ ఉండటంతో సినిమాల కోసం ఎంత కష్టమైనా చేయడానికి ఇష్టపడే వాడు.
అలా మొదటగా అతని 17వ యేట పూల్ ఔర్ కాంటే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు.ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అలా మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు తొలి పారితోషికంగా కేవలం 35 రూపాయలు అందుకున్నాడు.
అంతేకాకుండా ముంబై లాంటి మహానగరంలో ఎటువంటి ఆధారం లేకుండా బతకడం చాలా కష్టం.దానితో రోహిత్ శెట్టి ముంబైలో ఉన్నప్పుడు తన క్రియేటివిటీని ఉపయోగించుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు.
అంతేకాకుండా ముంబై లోని స్టార్ డైరెక్టర్స్ జాబితాలో తన పేరు ఉండేవిధంగా చూసుకున్నాడు.

ఇకపోతే రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన సూర్యవంశీ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా వసూళ్ల విషయంలో రికార్డులను సృష్టించింది.రోహిత్ శెట్టి ఎప్పుడూ కూడా సమయాన్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేస్తూ బిజీ బిజీగా ఉంటాడు.
అలా ఏడాదికి 35 నుంచి 45 కోట్ల వరకు సంపాదిస్తాడు.రోహిత్ శెట్టి మొత్తం స్థిరాస్తుల విలువ దాదాపు 280 కోట్లకు పైగా ఉంటుంది అని సమాచారం.
అలాగే ఒక సినిమాకు దర్శకత్వం చేసినందుకుగాను 25 కోట్లు పారితోషికంగా తీసుకుంటాడు అని తెలుస్తోంది.