10 కిలోల బ్యాగుతో ఐపీఎస్.. ఓపెన్ చేయమన్న ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఫ్యూజులు ఔట్...!

విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది చాలా స్ట్రిక్ట్ గా ప్రయాణికుల బ్యాగులు చెక్ చేస్తారు.ఏవైనా నిషేధిత పదార్థాలు అక్రమ రవాణా చేస్తున్నారా లేదా అనేది తెలుసుకునేందుకే ఈ చెకింగ్ జరుగుతుంది.

 Ips With 10 Kg Bag , 10,kg , Bag , Ips , Social Media , Airport , Security ,-TeluguStop.com

అయితే అనుమానం కలిగితే ఎవరినైనా చెక్ చేయగల రైట్స్ ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఉంటుంది.అయితే తాజాగా వీరికి ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా పై అనుమానం కలిగింది.

జైపూర్ నుంచి ప్రయాణిస్తున్న అరుణ్ ని జైపూర్ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆపారు.అనంతరం తన బ్యాగ్‌ని తెరవమని అడిగారు.

బ్యాగును తెరిచి చూడగా అందులో 10 కిలోల బఠానీలు ఉన్నట్లు అధికారులు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ తిన్నారు.ఐపీఎస్ ఆఫీసర్ 10 కిలోల బఠాణీలు విమానంలో తీసుకెళ్లడం ఏంటి?అని కూడా విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారట.

బఠానీలు ఉన్న తన బ్యాగ్ ఫొటోని బోత్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.చౌక ధర కారణంగా అతను జైపూర్ నుంచి పచ్చి బఠాణీలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.“జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ సిబ్బంది నా హ్యాండ్‌బ్యాగ్‌ని తెరవమని అడిగారు” అని ఐపీఎస్ అధికారి రాసుకొచ్చారు.పోస్ట్ కింద కామెంట్స్ విభాగంలో, తాను బఠాణీలను కిలో రూ.40కి కొనుగోలు చేసినట్లు బోత్రా తెలిపారు.ఇప్పుడు ఈ పోస్ట్ ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.

దీనికి ఇప్పటికే 68 వేలకు పైగా లైకులు వచ్చాయి.

గతంలో ఐఏఎస్ అధికారి అవనీష్ సొరకాయ, వంకాయ క్యారీ చేస్తున్నందుకు 2,000 రూపాయలు చెల్లించారు.

ఇంకా చాలామంది కూరగాయలు, తినే వస్తువులు భారీ ఎత్తున తీసుకెళుతూ విమాన సిబ్బంది కి షాక్ ఇచ్చారు.ఇలాంటివి జరగడం సాధారణం అని అంటుంటారు విమాన సిబ్బంది.

ఏదేమైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ 10 కిలోల బఠాణీలు చేతపట్టుకుని తిరగడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube