కేసీఆర్ కు పెను సవాళ్లు... ఆసక్తిగా మారిన తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయం అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో పెద్ద ఎత్తున రణరంగంగా మారుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలని భావిస్తుండగా ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫ ల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత కలిగించాలనే ఉద్దేశ్యంతో రకరకాల వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Big Challenges For Kcr . Telangana Politics Has Become Interesting Bjp Party, Te-TeluguStop.com

అయితే గత రెండు దఫా ఎన్నికల్లో కొన్ని సవాళ్ళు ఎదురైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కెసీఆర్ కు పెనుసవాళ్ళు ఎదురయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.ఎందుకంటే రానున్న రోజుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం పూర్తిగా తెలంగాణపై ఫోకస్ చేస్తుండటంతో అంతేకాక కాంగ్రెస్ నేతల కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉన్న నియోజకవర్గాలలో బలపడాలనే లక్ష్యంతో వరుస పర్యటనలు చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే రోజురోజుకు బీజేపీ పార్టీల, కాంగ్రెస్ పార్టీ ల కెసీఆర్ వ్యతిరేక ప్రచారంతో రోజురోజుకు పరిస్థితులు కెసీఆర్ కు సవాల్ గా మారుతున్నాయి.అయితే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణలో కూడా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను టీఆర్ఎస్ కు అనుకూలంగా ఎలా మారుస్తారనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా గమనిస్తున్న అంశం.

ఎందుకంటే ఇటువంటి కఠిన పరిస్థితులు గతంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీఆర్ఎస్ కు ఎదురైనా అధికారంలో ఉన్నప్పుడు ఎదురుకాకపోవడం కొసమెరుపు.ఏది ఏమైనా రానున్న రోజుల్లో కెసీఆర్ తన రాజకీయ చతురతను ఉపయోగించి తనకు అనుకూలంగా రాజకీయ పరిస్థితులను ఎలా మార్చుకుంటారనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube