తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.బిగ్ బాస్ షో మొదలై అప్పుడే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కూడా అయ్యారు.
అంతేకాకుండా మొదటి వారం రోజులు కాస్త బోరింగ్ గా సాగిన బిగ్ బాస్ షో ప్రస్తుతం కొట్లాటలు, గొడవలు, బూతుల మాటలతో రసవత్తరంగా మారింది.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు ఒకరిపై మరొకరు దాడి చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు.
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి తొలివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ అయిన ముమైత్ ఖాన్ కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
అయితే అందరూ అనుకున్న విధంగానే ముందునుంచి భయపడినట్టు జరిగింది.బిగ్ బాస్ హౌస్ లోకి ముమైత్ ఖాన్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె మాట తీరు,ఆమె ప్రవర్తన గమనిస్తే ఆట మీద కంటే నామినేషన్స్, ఎలిమినేషన్ మీదే ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి దగ్గర సంపతి గేమ్ చేసే పని మీద ధ్యాస ఉన్నట్టు కనిపించింది.ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే బయటకు వచ్చిన తర్వాత తాను ఇంత తొందరగా బయటకు వస్తానని ఊహించలేదు అంటూ బిగ్ బాస్ స్టేజ్ ఫై ఎమోషనల్ అయింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ హౌస్ లో ముమైత్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి హాట్ టాపిక్ గా మారింది.ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆమెకు పారితోషికం ఇచ్చారా లేదా అని ఆరా తీయడం మొదలు పెట్టగా, ఈ నేపథ్యంలో ఆమెకు ఒక పోవడానికి దాదాపు 80 వేల రూపాయలు పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.దీన్ని బట్టి చూస్తే ఆమెకు వారానికి దాదాపు లక్ష రూపాయల లోపు ఉండవచ్చని సమాచారం.
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బిగ్ బాస్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో విలువైన వ్యక్తులు ఎవరు? పనికిరాని వ్యక్తులు ఎవరు? అనే ట్యాగ్ న ఎవరికీ ఇస్తావ్ అని అడగగా.అఖిల్, అజయ్, తేజస్వి, అరియానా,, అషు రెడ్డి లకు విలువైన వ్యక్తులు అనే ట్యాగ్ ఇవ్వగా ఆర్జె చైతూ, బిందు మాధవి, సరయు లకు వెస్ట్ ట్యాగ్ ఇస్తాను అని తెలిపింది ముమైత్ ఖాన్.