రోజాకు షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. నగరి నుంచి పోటీ చేస్తానని చెబుతూ?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల క్రితం రోజా ఒక వెలుగు వెలిగారనే సంగతి తెలిసిందే.అప్పటి జనరేషన్ స్టార్ హీరోలకు జోడీగా రోజా నటించారు.

జయాపజయాలకు అతీతంగా రోజా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.సినిమాల్లో ఆఫర్లు తగ్గిన తర్వాత రోజా రాజకీయాలపై దృష్టి పెట్టారు.చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు విజయం సాధించారు.

2014 లో తక్కువ మెజారిటీతో రోజా విజయం సాధించగా 2019 సంవత్సరంలో మాత్రం రోజా ఎమ్మెల్యేగా కనీవిని ఎరుగని స్థాయిలో మెజారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం.నగరి నియోకవర్గ అభివృద్ధి కోసం రోజా కృషి చేయడంతో పాటు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని రోజా తన వంతు సాయం అందిస్తున్నారు.అయితే రోజాకు మరో స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ భారీ షాక్ ఇవ్వడం గమనార్హం.

వాణీ విశ్వనాథ్ మాట్లాడుతూ తాను 2024 సంవత్సరంలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ప్రస్తుతం చెప్పలేనని అయితే నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు.పొలిటికల్ గా తన మేనేజర్ అయిన రామానుజం చలపతి అనే వ్యక్తికి అన్యాయం జరిగిందని అందువల్లే తాను ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని డిసైడ్ అయ్యానని ఆమె పేర్కొన్నారు.

Telugu Roja, Vani Viswanth-Movie

రామానుజం చలపతి ఇతరులకు సాయం చేసే వ్యక్తని అతనికే ఇబ్బందులు ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో సులువుగా అర్థమవుతుందని ఆమె చెప్పుకొచ్చారు.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమని ఆమె చెప్పుకొచ్చారు.వాణీ విశ్వనాథ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అమ్మమ్మ నగరిలో నర్సుగా పని చేశారని నగరి ప్రజలు తనకు బాగా తెలుసని ఆమె వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube