మంచు భయ్యా మరీ ఓవర్‌ గా పెంచేయకు ప్లీజ్‌

గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీకి ఏ మాత్రం మంచి జరగడం లేదు.ఫ్యామిలీ విభేదాలు అంటూ ఒక వైపు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 Manchu Family Fans Tension About Manchu Vishnu Movie Details, Manchu Vishnu, Man-TeluguStop.com

మరో మరో వైపు ఆ ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలు కానీ ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాలు కానీ సక్సెస్ కావడం లేదు.ఇటీవల మోహన్బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా ఒక్క పాట కోసం కోట్లు ఖర్చు మోహన్బాబు ఆడంబరంగా ప్రకటించాడు.కానీ ఆ పాటకు ఖర్చు చేసిన మొత్తం కూడా రాబట్టలేక పోయింది.

కేవలం పాతిక లక్షల రూపాయలు కూడా ఆ సినిమా వసూలు చేయలేకపోయిందని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ సమయంలోనే మంచు విష్ణు తన కొత్త సినిమాకు సంబంధించిన హడావుడి మొదలు పెట్టాడు.

ఇటీవలే ఆ సినిమాలో తాను గాలి నాగేశ్వరరావు గా కనిపించబోతున్నట్లు గా ప్రకటించాడు.ఇక తనకు జోడిగా పాయల్ రాజ్ పుత్ మరియు కీలక పాత్రలో సన్నిలియోన్ కూడా నటించబోతున్నట్లు ఆయన తెలియజేశాడు.

పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీలియోన్ లు ఇద్దరు కూడా సినిమా స్థాయి ని పెంచడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Gaalinageswara, Manchu, Manchu Vishnu, Payal Raj Put, Payal Rajput, Son I

వేరే హీరోల సినిమాలకు ఎంత క్రేజ్‌ బజ్ పెరిగినా పరవాలేదు, కానీ మోహన్ బాబు ఫ్యామిలీ హీరోల సినిమాలకు మాత్రం కాస్త కష్టమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే మంచు విష్ణు సినిమా పై అంచనాలు మరీ ఎక్కువ వద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారట.

సినిమా అతి త్వరలో ప్రారంభం కాబోతున్న తెలుస్తోంది.సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మంచు ఫ్యామిలీకి అభిమానులకు ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube