దిగ్గజ టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ వీ.ఆర్ వనిత తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ ఆమె తన ఫ్యాన్స్ అందరికీ భారీ షాక్ ఇచ్చింది.ఆమె వయసు కేవలం 31 ఏళ్లే కావడం విశేషం.
తన రిటైర్మెంట్ విషయాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.మేటి ప్లేయర్ అయిన ఈమె క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో అందరూ నిరాశ వ్యక్తపరుస్తున్నారు.
అయితే ఇప్పటివరకు తాను జాతీయ జట్టులో చేసిన జర్నీ గురించి వనిత ట్విట్టర్ వేదికగా మనసుని హత్తుకునేలా వివరించింది.రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తులో ఎమర్జింగ్ టాలెంట్ ను పెంచుకోవడానికి తాను రెడీగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది.
సరిగ్గా 19 ఏళ్ల క్రితం తాను క్రికెట్ ఆట ఆడటం స్టార్ట్ చేశానని ఆమె గుర్తు చేసుకుంది.తన 12 ఏళ్ల ప్రాయంలో క్రీడలను తాను ఎంతగానో ఇష్టపడేదాన్ని అని తెలిపింది.
ఇప్పటికీ కూడా క్రికెట్ ఆట పై తనకు ఎంతగానో ప్రేమ ఉందని కానీ ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని ఆమె వివరించింది.
తన క్రికెట్ బూట్లను అప్‌సైడ్ డౌన్ వేలాడదీసే సమయం ఆసన్నమైందని ఆమె తన రిటైర్మెంట్ గురించి చెప్పుకొచ్చింది.తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో తాను ఎందరో క్రికెటర్లతో కలిసి ప్రయాణించానని చెప్పుకొచ్చింది.ఈ సమయంలో తనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
అలాగే తన కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసింది.ఇర్ఫాన్, నాజ్ భాయ్ వంటి నిపుణులు తనలో ఆట నైపుణ్యాలకు పదును పెట్టారని ఆమె గుర్తు చేసుకుంది.
కోచ్ మురళి, మెంటార్ వరుణ్, ట్రైనర్ రోహన్ ఇలా అందరికీ ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది.అయితే ఒక స్టార్ మహిళా క్రికెటర్ ఇలా చిన్న వయసులోనే అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలకడం బాధాకర విషయమే అని క్రికెట్ ప్రియులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.