ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని కలవర పెడుతున్న సమస్య అధిక బరువు.కారణం ఏదైనప్పటికీ ఈ సమస్య అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది.
అందుకే బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అధిక బరువుతో బాధ పడుతున్న వారికి, వెయిట్ లాస్ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారికి ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ డ్రింక్‌ను తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే బరువు తగ్గడాన్ని మీరు గమనిస్తారు.
మరి ఇంకెందుకు లేటు ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఏ సమయంలో ఆ డ్రింక్‌ను సేవించాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు నిమ్మ పండ్లను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రెండు గ్లాసుల వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించారు.
నీరు సగం అయ్యాక.స్టవ్ ఆఫ్ చేసి వాటర్‌ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు అందులో రుచికి సరిపడా తేనెను కలిపితే.వెయిట్ లాస్ డ్రింక్ సిద్ధమైనట్టే.
ఈ ఎఫెక్టివ్ డ్రింక్‌ను బ్రేక్ ఫాస్ట్ చేయడానికి గంట ముందు తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక శరీరంలో పేరుకు పోయిన కొవ్వంతా కరిగి పోతుంది.కేవలం వారం రోజుల్లో మీ శరీర బరువు తగ్గడం ప్రారంభం అవుతుంది.కాబట్టి, అధిక బరువు ఉన్నామని బాధ పడుతూ కూర్చోకుండా.పైన చెప్పిన డ్రింక్‌ను తయారు చేసుకుని తీసుకోవడానికి ప్రయత్నించండి.తద్వారా మంచి ఫలితాలు పొందుతారు.