బుల్లి తెర స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇతను రామోజీ ఫిలిం సిటీలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ జబర్దస్త్ కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చారు.
ఈ విధంగా టీం మెంబర్ గా పనిచేస్తున్న సుడిగాలి సుధీర్ తనలో ఉన్న టాలెంట్ బయటపెట్టడంతో అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ జబర్దస్త్ యాంకర్లలో ఒకరైన రష్మీతో కలిసి ఈయన చేసే స్కిట్లకి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు.
ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ అనంతరం ఢీ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.
కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రస్తుతం ఢీ కార్యక్రమం నుంచి తప్పుకున్న సుధీర్ ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రత్యేక ఈవెంట్లలో కూడా సుడిగాలి సుధీర్ క్రేజ్ మామూలుగా ఉండదు అని చెప్పవచ్చు.ఈ విధంగా బుల్లితెరపై ఎన్నో అవకాశాలను దక్కించుకుని వెండితెరపై కూడా పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ విధంగా సుడిగాలి సుధీర్ కెరియర్ లో దూసుకుపోతున్న క్రమంలో తాను ప్రస్తుతం బుల్లితెరపై చేస్తున్న అన్ని షోలను మానేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ విధంగా సుధీర్ అన్ని షోలలో చేయడం మానేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయినప్పటికీ ఇది కేవలం స్కిట్ లో భాగంగా మాత్రమే చెప్పినట్లు తాజాగా విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమో ద్వారా తెలుస్తోంది.ప్రతివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ఎప్పటిలాగే తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ఒకరి పై ఒకరు పంచులు వేసుకుంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
ఈ సందర్భంగా వీరిద్దరూ వేదికపైకి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హైపర్ ఆది మాట్లాడుతూ రష్యాలో తప్పులు చేస్తే శిక్షలు భిన్నంగా ఉంటాయి కదా అని సుధీర్ ను అడిగారు.అప్పుడు సుధీర్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అడగగా తప్పు చేస్తే అందరూ గుండుగీస్తారు కానీ నీకు మీసాలు గడ్డాలు తీసేసారు అంటూ తన పై పంచ్ వేసాడు.
ఇలా ఒక్కసారిగా హైపర్ ఆది అనడంతో వెంటనే సుధీర్ అలా అంటావ్ ఏంటి రా ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ కాక ఢీ నీతో చేయలేక ఎంత బాధ పడుతున్నానో తెలుసా అంటూ ఢీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం బయటపెట్టారు.సుధీర్ ఈ మాట అన్న వెంటనే ఆ సమయంలో ఆది ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఎక్కడ ఢీ కొడుతున్నావు అని నేను బాధ పడుతున్నాను తెలుసా అంటూ తన పై పంచ్ వేశాడు.నువ్విలా ఎక్స్ట్రాలు చేసావంటే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మూడు షో లు మానేస్తా అంటూ హైపర్ ఆది చిన్న ఝలక్ ఇచ్చారు.ఈ విధంగా ఈ స్కిట్ లో భాగంగా సుధీర్ అన్ని షోలు మానేస్తాను అని చెప్పడం వైరల్ గా మారింది.