బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఈ యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సుశాంత్ మరణం ఇప్పటికీ ఎంతో మంది అభిమానులను కలిచివేస్తోందని చెప్పవచ్చు.
ఇక సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి.ముఖ్యంగా డ్రగ్ మాఫియా బీటౌన్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టించింది.
ఈ క్రమంలోనే దివంగత నటుడు సుశాంత్ మరణం తర్వాత ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి పై డ్రగ్స్ గురించి ఆరోపణలు రావడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సెప్టెంబర్ 2020లో రియాను అరెస్టు చేశారు.దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి నటి రియా చక్రవర్తి ఎంతో కఠినమైన జీవితాన్ని గడుపుతుంది.
ఈమె పై ఈ విధంగా డ్రగ్స్ ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అధికారులు ఈమెను నెలరోజుల పాటు ముంబైలోని బైకుల్లా జైలుకు పంపించారు.
ఇలా జైలుకు వెళ్లిన రియా చక్రవర్తి బెయిల్ పై బయటకు రావడంతో ఈమె ఎక్కువగా మీడియాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు.
ఇలా ఈమె పై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో తనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుంచి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న రియా చక్రవర్తి తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేస్తూ రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాను అంటూ తెలియజేశారు.
ఇలా ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియోని షేర్ చేసిన ఆమె ఆ వీడియో కింద ఒక క్యాప్షన్ కూడా పెట్టారు.నేను రెండు సంవత్సరాల తర్వాత నిన్న నా పనుల నిమిత్తం వెళ్లాను ఇలా ఎంతో కఠినమైన సమయాలలో నాకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ సూర్యుడు మాత్రం వెలుగును వెదజల్లుతూనే ఉంటాడు.అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గదు… అంటూ రియా చక్రవర్తి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సుశాంత్ మరణం తర్వాత ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా అవకాశాలను కూడా అందుకొని సాధారణ జీవితాన్ని గడుపుతుందని రియా చక్రవర్తి ఈ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పేశారు.