తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17 వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు హైదరాబాద్ జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్.
జూబ్లీహిల్స్ లోని టి.
ఆర్.ఎస్.కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడేళ్ల లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఎన్నో పథకాలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నారన్నారు.ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా కళ్యాణ మహోత్సవానికి సంబంధించి లోగోను విడుదల చేశారు.గత సంవత్సరం మాదిరిగానే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టి.ఆర్.ఎస్.కార్పొరేటర్లు సి.ఎన్.రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, దేదీప్య, సంగీత యాదవ్, టి.ఆర్.ఎస్.డివిజన్ అధ్యక్ష్యులు తదితరులు పాల్గొన్నారు.