టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ యువతను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ ను విడుదల చేశారు చిత్ర బృందం.
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను, అల్లరిని చూపిస్తూ సాగిపోయే ‘అల్లంత దూరంగా నువ్వు .నీ కన్ను నన్నే చూస్తుంటే’ అనే పాటను విడుదల చేశారు.ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ యువతను ఎంతో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పాట కు వివేక్ సాగర్ ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించగా సింగర్స్ చైత్ర, అభయ్ ఆలపించారు.ఇలా ఎంతో అద్భుతంగా సాగిపోయే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.