ప్రకృతి జోలికి వెళ్తే పతనం అయిపోతాం.ఈ డైలాగ్ ను సినిమాల్లో బాగా వింటున్నాం కదా.
అయితే సినిమాల్లో ప్రకృతి ప్రలయాళను బాగానే చూపిస్తుంటారు.ఇలా సినిమాల్లో జరిగేవి కొన్ని సార్లు నిజ జీవితాల్లో కూడా జరుగుతుంటాయి.
ఇందుకు నిదర్శనంగా చాలా ఘటనలే జరిగాయి.ప్రకృతి జోలికి వెళ్లి.
చివరకు అదే ప్రకృతి కోపానికి బలైపోయిన వారు చాలామందే ఉన్నారు.అయితే ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో ఎంతలా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది.
మనకు తెలిసినంత వరకు చెట్లు మనుషులకు జీవనాధారం లాంటివి.
అవి లేకపోతే మనుషుల జీవనం సాధ్యం కాదు కదా.అయితే ఇప్పుడు చెట్లను ఎంతలా నరికి వేస్తున్నామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇష్టం వచ్చినట్టు అడవులను నరికి వేస్తున్నాం.అయితే ఇలా చెట్లను నరికి వేసే క్రమంలో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.ఇంకా చెప్పాలంటే కొంత బాధాకరమైన అంశం అనే చెప్పుకోవాలి.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
దీన్ని చూసిన వారంతా కూడా ప్రకృతితో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి పెద్ద చెట్టును నిచ్చెన సాయంతో నరుకుతున్నట్టు మనకు కనిపిస్తుంది.అయితే అతి కష్టం మీద ఆ చెట్టును నరికిన తర్వాత ఆ చెట్టు కింద పడిపోవడం మనకు కనిపిస్తుంది.ఇలా ఆ చెట్టు పడిపోయే క్రమంలో చివరి భాగం నిచ్చెనను నెట్టేస్తుంది.
దీంతో అతను కింద పడిపోవడం ఇందులో చూడొచ్చు.అంటే తనను నరికినందుకు ఆ చెట్టే బుద్ధి చెప్పిందన్న మాట.
దీన్ని చూసిన వారంతా కూడా తన పాపం ఇలా పండిందంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరేమో ప్రకృతి జోలికి వెళ్లొద్దంటూ సలహాలు ఇస్తున్నారు.