తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలో లీనమై నటించారు.
ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం వెనుక కూడా ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయని ఎన్నో అవమానాలు ఉన్నాయని నటి సుధ ఓ సందర్భంలో తాను పడిన కష్టాల గురించి తెలిపారు.ఇకపోతే తనకు ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ (ప్రభుదేవా తండ్రి) తనని అనకూడని మాటని అందరి ముందు అవమానించారని ఈ సందర్భంగా సుధ తెలియజేశారు.
ఓ తమిళ సినిమా షూటింగ్ లో భాగంగా సుందరం మాస్టర్ ఓ పాటకు కొరియోగ్రఫీ చేశారు.అయితే ఆ పాటలో ఒక చిన్న మూమెంట్ ఎన్నిసార్లు చేసిన తనకు చేయడం రాలేదని సుమారు నాలుగైదు టేక్ లు తీసుకున్నానని అయినప్పటికీ రాకపోవడంతో సెట్ లో అందరూ చూస్తుండగానే సుందరం మాస్టర్ ఛీ… నువ్వు వ్యభిచారం చేయడానికి కూడా పనికి రావు అంటూ నన్ను తిట్టారని ఈ సందర్భంగా సుధ తెలిపారు.
ఇలా సెట్ లో ఎంతో మంది పెద్దలు ఉన్నారు.వారందరూ ముందు సుందరం మాస్టర్ ఇలా అనడంతో తనకు ఎంతో అవమానంగా అనిపించిందని, అక్కడినుంచి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తల్లితో జరిగిన దంతా చెప్పానని సుధా తెలిపారు.ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా, పెద్ద ఆర్టిస్ట్ అయినా సుందరం మాస్టర్ ఆ మాట అనడం చాలా తప్పు.ఆ మాట అని ఉండ కూడదని సుధా తెలిపారు.
ఇక ఆ సమయంలో తన సినిమాల్లో నటించ కూడదని ఫిక్స్ అయ్యాయని అయితే తన తల్లి మాత్రం ఆయన ఇవాళ కాకపోతే మరి కొద్ది రోజులలో దర్శకుడు అవుతారు.అప్పుడు తన సినిమాలో నిన్ను నటించమని అడుగుతారు.
అప్పుడు నీ నటనతోనే తనకు సమాధానం చెప్పాలని తన తల్లి చెప్పినట్లు ఈమె తెలియజేశారు.
అమ్మ చెప్పిన విధంగానే మరో ఆరు నెలలకు సుందరం మాస్టర్ దర్శకుడిగా తన వద్దకు వచ్చి తన సినిమాలో నటించాలని కోరారు.కోటి రూపాయలు ఇచ్చిన తన సినిమాల్లో నటించనని తెగేసి చెప్పినట్లు తెలిపారు.ఇలా ఈ సినిమాల్లో నటించనని చెప్పడంతో ఏకంగా తన తల్లి తన పై చేయి చేసుకోవడానికి కూడా వెనకాడటం లేదని.
నీకేమని చెప్పాను ఆయన వచ్చి నా సినిమాలో నటించమని అడిగితే నువ్వు నటించాలి.అలా నటించినప్పుడే ఆయన చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నట్లు అర్థమని అమ్మ తెలిపారు.
ఈ విధంగా తన తల్లి చెప్పడంతో ఆ సినిమాకు అగ్రిమెంట్ పూర్తి చేశామని.మరుసటి రోజు లొకేషన్ లో పాల్గొని సింగిల్ టేక్ లో షాట్ ఓకే కావడంతో అందరూ చప్పట్లు కొడుతూ ప్రశంశలు కురిపించారు.ఆ సినిమాలో తాను తల్లి పాత్రలో నటించానని, ఈ షాట్ పూర్తి అయిన తరువాత స్వయంగా సుందరం మాస్టర్ తన వద్దకు వచ్చి ఆ రోజు అలా మాట్లాడి నందుకు నన్ను క్షమించమ్మా అని క్షమాపణలు చెప్పారని ఈ సందర్భంగా సుధ తెలియజేశారు.