అక్కినేని హీరోల క్రేజ్ తగ్గిందా.. బంగార్రాజు వసూళ్లే అందుకు ప్రూఫా?

సాధారణంగా ప్రతి సంక్రాంతి పండుగకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు థియేటర్ వద్ద తీవ్ర స్థాయిలో పోటీ పడతాయి అనే విషయం మనకు తెలిసిందే.ఇలా స్టార్ హీరోలు నటించిన సినిమాలన్నీ ఒకేసారి సంక్రాంతి బరిలో దిగడంతో నువ్వా నేనా అనే పోటీ నెల కొంటుంది.

 The Akkineni Heroes Range Is Decreased There Is Proof With Bangaraju Movie Colle-TeluguStop.com

అయితే ఈ ఏడాది కూడా సంక్రాంతి పోటీ బీభత్సంగా ఉంటుందని చాలా మంది భావించారు.ఎందుకంటే సంక్రాంతి బరిలో ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

ఇలా నువ్వా నేనా అంటూ పోటీ లోకి దిగిన ఈ చిత్రాలకు కరోనా పోటీ నుంచి వెనక్కి లాగిందని చెప్పవచ్చు.పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ఈ సినిమాలను దేశ వ్యాప్తంగా విడుదల చేయాలి.

ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పలు సినిమాలను వాయిదా వేశారు.

అయితే ఈ సమయాన్ని నాగార్జున బంగార్రాజు టీమ్ ఎంతో అద్భుతంగా ఉపయోగించుకున్నారని చెప్పవచ్చు .ఇలా సంక్రాంతి బరిలో పాన్ ఇండియా చిత్రాలు ఉంటాయని తెలియడంతో ఆ సినిమాల ముందు బంగార్రాజు సినిమా చాలా చిన్న సినిమాగా కనిపించింది.అయితే అనుకోని విధంగా ఆ సినిమాలన్నీ వాయిదా పడడంతో సంక్రాంతికి బంగార్రాజు పెద్ద సినిమాగా విడుదలైంది.

ఇక ఈ సినిమాకి పోటీగా ఇతర సినిమాలు లేకపోవడంతో సంక్రాంతి పండుగను బంగార్రాజు బాగా క్యాష్ చేసుకున్నారని చెప్పవచ్చు.

ఇలా ఈ సినిమాకు ఇతర ఏ సినిమాలు పోటీలేవని తెలియడంతో బయ్యర్లు కూడా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేయడం కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 38 కోట్లకు పైగా చేసినట్లు సమాచారం.విడుదలకు ముందే ఈ విధంగా బిజినెస్ చేసిన ఈ సినిమా విడుదలైన మొదటి వారం కలెక్షన్ పరంగా దూసుకు పోతోంది.

ఇలా మొదటి వారం అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన బంగార్రాజు ఆ తర్వాత కలెక్షన్ల పరంగా కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది.ఈ విధంగా ఈ సినిమా విడుదలైన 20 రోజులలో కలెక్షన్లు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చి తడబడినట్లు తెలుస్తుంది.

ఇలా మొదటి రెండు వారాలు కలెక్షన్ ఎంత బాగా రాబట్టినప్పటికీ ఈ సినిమా 20వ రోజు ప్రసారం అయినప్పటికీ అన్ని ఏరియాలలో కలిపి కేవలం పది లక్షల షేర్స్ మాత్రమే రావడంతో ఇక్కడితో అక్కినేని హీరోల హవా పూర్తిగా ముగిసి పోయిందని తెలుస్తోంది.ఇక ఈ సినిమా విడుదలైన 20 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను చూస్తే 38.12 కోట్ల నెట్, 64.07 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా మరో 88 లక్షలు రాబడితే బ్రేక్ ఈవెన్ మార్క్ అయినా 39 కోట్లను దాటుతారు.మరి ఈ వారంలో బంగార్రాజు ఈ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతారా… లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

The Akkineni Heroes Range Is Decreased There Is Proof With Bangaraju Movie Collections Akkineni Heroes, Tollywood, Range, Bangaraju, Film Industry, Collections, Krithi Shetty , Ramya Krishna - Telugu Akkineni Heroes, Bangaraju, Range, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube