2021 సంవత్సరంలో చైతన్య సమంత విడాకుల వార్త అభిమానులకు పెద్ద షాక్ అనే సంగతి తెలిసిందే.ఎందుకు విడిపోయారనే కారణాలు ఎవరికీ కచ్చితంగా తెలియకపోయినా చైసామ్ విడిపోయారనే వార్త నిజం కాకపోతే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపించాయి.
విడాకుల ప్రకటన తర్వాత చైతన్య పలు ఇంటర్వ్యూలలో సమంత పేరును ప్రస్తావిస్తూ ఆమె గురించి పాజిటివ్ గానే చెబుతూ వచ్చారు.
అయితే నిన్నంతా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో, పలు న్యూస్ ఛానెళ్లలో నాగార్జున చైసామ్ విడాకుల విషయంలో సమంతదే తప్పని చెప్పారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
సమంతనే మొదట విడాకుల కోసం దరఖాస్తు చేసిందని నాగార్జున చెప్పినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.ఈ వార్తలను నిజమేనని నమ్మిన అభిమానులు సమంతదే తప్పని భావించారు.
అయితే నాగ్ ఈ వార్తల గురించి స్పందించి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
రూమర్లను మీడియా ప్రచారం చేయవద్దని సమంత గురించి తాను అలా చెప్పలేదని నాగార్జున ట్విట్టర్ ద్వారా కోరారు.
అయితే ఈ వార్తలు ఏ విధంగా ప్రచారంలోకి వచ్చాయనే ప్రశ్నకు బాలీవుడ్ మీడియా పేరు సమాధానంగా వినిపిస్తోంది.ప్రముఖ బాలీవుడ్ మీడియా వెబ్ సైట్ ఈ వార్తను ప్రచురించడంతో కొన్ని తెలుగు పత్రికలు సైతం క్రాస్ చెకింగ్ చేసుకోకుండా ఈ వార్తను ప్రచురించాయి.
అలా ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.
నాగ్ స్పందించడంతో ఈ రూమర్ ఆగిపోయింది.బంగార్రాజు ప్రమోషన్స్ సమయంలో కూడా నాగార్జున చైసామ్ విడాకుల గురించి స్పందించినా ఒకరిది తప్పనే విధంగా ఆయన స్పందించ లేదనే సంగతి తెలిసిందే.సమంత, నాగచైతన్య తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.
చెప్పకూడని కారణం కాబట్టే సమంత చైతన్య విడాకుల ప్రకటన గురించి వెల్లడించడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.