బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో ఈయన వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎవ్వరు చేయనన్ని పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ విధంగా దూసుకు పోతున్నాడు.
ప్రభాస్ చేతిలో ప్రసెంట్ ఐదారు పాన్ సినిమాలు ఉన్నాయి.
అందులో రాధేశ్యామ్ ఒకటి.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.ఇంకా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రోత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తుండగా.
సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా ప్రకటించి లైన్లో పెట్టుకున్నాడు.

ఈ సినిమాల్లో ఆదిపురుష్, సలార్ షూటింగ్ లు ఇప్పటికే చాలా శాతం పూర్తి చేసాడు.ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే కూడా సెట్స్ మీదకు వెళ్లి ఫాస్ట్ గా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ మూడు సినిమాలను ప్రభాస్ పార్లల్ గా పూర్తి చేస్తూ వస్తున్నాడు.
ఇందులో ఒక సినిమా షూటింగ్ ఆదిపురుష్ కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఇక త్వరలోనే సందీప్ వంగ స్పిరిట్ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు.

ఇరాక్ ఇన్ని సినిమాలు లైన్లో ఉన్నప్పటికీ ప్రభాస్ ఇంకా స్క్రిప్ట్ లు వింటూనే ఉన్నాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డార్లింగ్ ఒక బడా నిర్మాత దగ్గర దాదాపు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను అడ్వాన్స్ గా అందుకున్నాడని ప్రచారం జరుగుతుంది.డివివి దానయ్య ప్రభాస్ కు ఒక సినిమా కోసం 50 కోట్లు ముందుగానే ఇచ్చాడట.ఈ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.మరి ఈ విషయం నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ షేర్ అవుతుంది.