ఇప్పటి రాజకీయాల్లో ఒక పార్టీ గెలవాలంటే మాత్రం చాలా కష్టం.ఎందుకంటే ఇప్పటి పార్టీలు అన్నీ కూడా సొంత సామాజిక వర్గాల బలంతోనే గెలుస్తున్నాయి.
అధినేత సామాజిక వర్గంకు చెందిన నేతలు అందరూ ఆ పార్టీకి మద్దతు ఇస్తేనే ఆ పార్టీకి బలం పెరుగుతుంది.ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్‌రెడ్డి పార్టీలను చూస్తూనే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
కాగా జనసేనకు కూడా ఇలాంటి మద్దతే ఇప్పుడు చాలా అవసరం వచ్చి పడింది.తన సొంత సామాజిక వర్గం నుంచి ఎలాంటి మద్దతు రావట్లేదని పవన్ ఆందోలన చెందుతున్నారంట.
దీంతో ఇప్పడు రాష్ట్రంలో కాపు నేతల్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్ అవుతోంది.కాపులకు అధికారం అనే సింబల్ జనసేన నుంచి వారికి కనిపించినప్పుడు.
వారంతా స్వీయ ఆలోచనలో పడిపోతున్నారంట.ఇప్పటికే ఆయా పార్టీల్లో కీలక నేతలుగా ఉన్న కాపు రాజకీయ నేతలు.
ఆ పార్టీలను వదిలి జనసేనలోకి వస్తారా అంటే అనుమానమే.ఎందుకంటే.
వారంతా సొంత ఇమేజ్ తో ఎదిగిన నేతలు.కాబట్టి ఇలాంటి సమయంలో వైసీపీని గానీ లేదంటే టీడీపీని గానీ వీడి రావాలంటే ఆలోచిస్తున్నారు.
పైగా పవన్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు.
కానీ వాస్తవంగా చెప్పాలంటే సొంత సామాజిక వర్గం అయిన కాపుల సంఖ్య ఏపీలో చాలా ఎక్కువగా ఉంది.
వారు సపోర్టు చేస్తే కచ్చితంగా పవన్‌కు అధికారం దక్కే ఛాన్స్ ఉంటుంది.కానీ ఈ విషయంలో మాత్రం పవన్‌కు పెద్దగా సపోర్టు రావట్లేదనే చెప్పాలి.
రాబోయే రోజుల్లో పవన్ కచ్చితంగా తన సామాజిక వర్గాలకు చెందిన నేతలను తన పార్టీలోకి రమ్మనే ఛాన్స్ ఎటూ లేకపోలేదు.కానీ ఇప్పటి వరకు అయితే వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట.
పవన్ వారికి బలమైన నమ్మకాన్ని ఇస్తే మాత్రం వారు కచ్చితంగా పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.చూడాలి మరి ఏం జరుగుతుందో.