అబ్బో బేబమ్మకు ఆ రేంజ్ ఉందట... గ్లిజరిన్ లేకుండా నటించగలదట!

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు.ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

 Krithi Shetty Speech Bangarraju Movie Press Mee, Krithi Shetty, Bangarraju, Naga-TeluguStop.com

ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు.విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.2020 లో బంగా ర్రాజు సినిమా కథను విన్నాను.

ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమా చూశాను.అందులో కామెడీ టైమింగ్ నాకు చాలా బాగా నచ్చింది.ఆ రిఫరెన్స్ తోనే బంగార్రాజు సినిమా చేసేటప్పుడు ఒత్తిడి అని నాకు అనిపించలేదు అని తెలిపింది బేబమ్మ.ఇక బంగార్రాజు సినిమాలో నా పాత్ర నాగలక్ష్మి గురించి దర్శకుడు చెప్పగానే మొదట నవ్వేశాను.

ఎందుకంటే ఇలాంటి వారు కూడా ఉంటారా అని నాకు అనిపించింది అని తెలిపింది.అందుకే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను.

సినిమాని చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా అదే విధంగా ఫీలవుతారు అనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.సినిమాలో నేను గ్లిజరిన్ లేకుండా ఏడుపు సీన్స్ చేస్తాను.

Telugu Bangarraju, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna-Movie

నటి గా ఎదగడానికి ఉపయోగపడే, పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.సంక్రాంతి గురించి పెద్దగా నాకు తెలియదు.కానీ సినిమా చేస్తున్న సమయంలో సంక్రాంతి పండుగ అంటే ఏమిటో తెలిసింది.ఇక సంక్రాంతికి ఏ సినిమా విడుదల అయినా చూస్తాము అని నాకు తెలిసిన తెలుగు వారు చెప్పడంతో ఇక్కడి వారు ఎంతగా ప్రేమిస్తారో అర్థం అయింది అని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

ఇక అలాగే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా పూర్తి చేశాను.ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నాను.అలాగే హీరో రామ్ తో మరో సినిమా చేస్తున్నాను.ఇప్పటివరకు లేడీ ఓరియంటెడ్ కథ ఇంకా ఫైనల్ కాలేదు అని తెలిపింది కృతి శెట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube