ప్రేక్షకుల్లో మెజారిటీ ప్రేక్షకులు సినిమా రంగానికి చెందిన వాళ్లకు ఏ కష్టాలు ఉండవని భావిస్తారు.అయితే సెలబ్రిటీలు మాత్రం తాము కూడా సాధారణ మనుషులమేనని తమ జీవితంలో కూడా కష్టాలు ఉంటాయని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు.
స్టార్ హీరోయిన్ సమంత తను రియల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు.తాను మానసిక సమస్యలను ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు.
నిన్న ఒక హోటల్ లో జరిగిన సైకియాట్రీ ఎట్ డోర్ స్టెప్ అనే ప్రోగ్రామ్ కు సమంత గెస్ట్ గా హాజరయ్యారు.దాట్ల ఫౌండేషన్, రోష్ని ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ తనకు కూడా మానసిక సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.ఫ్రెండ్స్, డాక్టర్స్ చేసిన సాయం వల్ల తాను ఆ సమస్యలను ఎదుర్కోవడం సాధ్యమైందని సమంత చెప్పుకొచ్చారు.
ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కౌన్సిలర్ల వల్లే తాను ఈరోజు ప్రేక్షకుల ముందు ధైర్యంగా నిలబడటం సాధ్యమైందని సామ్ కామెంట్లు చేశారు.
సరైన కౌన్సిలర్స్ సాయంతో డాక్టర్స్ దగ్గరకు వెళ్లకుండా మానసిక సమస్యలను పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.బయటకు చెప్పలేని మానసిక సమస్యలు ఎంతోమందిని వేధిస్తున్నాయని అయితే ఆ సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలను దక్కించుకోవడం ముఖ్యమని సమంత తెలిపారు.మానసిక సమస్యలతో బాధ పడేవాళ్లు ఇతరులకు ఆ సమస్యల్ని చెప్పుకుంటే మంచిదని సామ్ సూచనలు చేశారు.
సైకియాట్రీ ఎట్ డోర్ స్టెప్ ద్వారా రోష్ని ట్రస్ట్ మానసిక సమస్యలతో బాధ పడేవాళ్లకు సహాయం చేయడానికి ముందుకు రావడం సంతోషించదగిన విషయమని సమంత కామెంట్లు చేశారు.సమంత తాను కూడా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానంటూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం యశోద షూటింగ్ తో సమంత బిజీగా ఉన్నారు.